కుక్క వర్షంలో తడవకుండా ఆ పని చేసిన చిన్నారి.. వైరల్!

చిన్నారులు దేవుడితో సమానం అని చెబుతుంటారు. వారి మనసు ఎటువంటి కల్మషం లేకుండా ఎంతో మంచి భావంతో ఉంటుందని చెబుతారు. కానీ ఇతరుల పట్ల మానవత్వం, జాలి ,దయ మంచి పనులు చేయాలంటే వయసు అవసరం లేదు మంచి మనసుంటే చాలు అని చెబుతుంటారు. అచ్చం అలాంటి మంచి మనసే ఈ చిన్నారికి ఉందని నిరూపించుకుంది.

తాజాగా ఓ చిన్నారి తన కుక్క వర్షంలో తడవకుండా, దానికి గొడుగు పట్టి తాను వర్షంలో మద్దయి పోయింది. తనకంటే ఎక్కువగా కుక్కకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఈమె మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ కుక్క పట్ల ఆ చిన్నారి చూపిన ప్రేమకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిన్నారికి సంబంధించిన వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్‌ స‌ర్వీసెస్ అధికారి శుశాంత్ నంద ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో వర్షంలో ఓ పాప గొడుగు పట్టుకొని వెళుతుండగా తన ముందుకు వెళుతోంది. అయితే అది తడవకుండా ఆ చిన్నారి కుక్కకు గొడుగు పట్టింది. చిన్నారి గొడుగు పట్టడంతో ఆ కుక్క అటూ ఇటూ కదులుతూ ఉన్నప్పటికీ చిన్నారి వదలకుండా ఆ కుక్కను వర్షంలో తడవకుండా గొడుగు పట్టింది.

ఈ వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ షేర్ చేస్తూ… ‘ఇత‌రుల కోసం చిన్న చిన్న పనులు చేయ‌డ‌మే ద‌య‌. అది మనం చేయ‌గ‌లిగిందే’ అనేక ఆప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిన ఎంతో మంది నెటిజన్లు ఆకట్టుకోవడంతో ఆ చిన్నారిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.