మైదానంలోకి శునకం ఎంట్రీ.. అందరూ చూస్తుండగానే పరుగులు పెట్టింది.. వీడియో వైరల్

సాధారణంగా మనం క్రికెట్ చూస్తున్న సమయంలో మ్యాచ్ మధ్యలో శనకాలు, పావురాలు వచ్చి కొద్దిసేపు అంతరాయాన్ని కలిగిస్తాయి. ఇలా చాలా సందర్భాల్లో జరిగాయి కూడా. అయితే వాటిని సిబ్బంది అక్కడ నుంచి పంపించే దాకా మ్యాచ్ ఆగిపోతుంటుంది.

ఇలాంటిదే ఒక ఘటన మహిళా టీ20 లో చోటు చేసుకుంది. అది ఎక్కడంటే.. మహిళల దేశీయ టి 20 టోర్నమెంట్ ‘ఆల్ ఐర్లాండ్ టి 20 కప్’ జరుగుతోంది. దీని సెమీ-ఫైనల్ మ్యాచ్ శనివారం 11 సెప్టెంబర్‌లో జరిగింది. ఈ మ్యాచ్ లో బైర్డీ క్రికెట్ క్లబ్ వర్సెస్‌ సివిల్ సర్వీస్ నార్త్ జట్లు తలపడ్డాయి. ఈ రెండు టీమ్ లలో ఎవరు గెలిచిన ఫైనల్లో అడుగు పెడతారు.

బైర్డీ క్లబ్ మొదట బ్యాటింగ్ పూర్తి చేసి 105 పరుగుల లక్ష్యాన్ని సివిల్ సర్వీస్ నార్త్ జట్టుకు ఇచ్చింది. వాళ్లు ఆ పరుగులను చేజించే క్రమంలో మ్యాచ్ మధ్యలోకి ఓ శునకం బయట నుంచి వచ్చేసింది. ఇన్నింగ్స్ 9 వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తున్నక్రమంలో ఆ బాల్ థర్డ్ ఎంపైర్ మీదుగా వెళ్లింది. దానిని చేతిలోకి తీసుకున్న ఫీల్డర్ నేరుగా కీపర్ కు ఇచ్చింది.

అక్కడ రన్ అవుట్ అయ్యే క్రమంలో వికేట్లకు కొట్టిన బంతి మిస్ అయి మైదానంలోనే కొద్ది దూరం వెళ్లింది. దానిని ఆ శునకం నోటిలో పెట్టుకొని కొద్దిసేపు అక్కడే తిరిగింది. ఇలా ఆ శునకానికి సంబంధించిన యజమాని వచ్చి దాని దగ్గర ఉన్న బాల్ ను వాళ్లకు ఇచ్చేసి దానిని తీసుకొని వెళ్తాడు. ఇతంతా చూస్తున్న ప్రేక్షకులకు కొద్దిసేపు ఫన్నీగా అనిపించింది.