సరదాగా నడుచుకుంటూ వెళ్లిన ఆ బాలుడు కరెంట్ పోల్ ను తాకాడు.. తర్వాత ఏమైందంటే..

ప్రమాదవశాత్తు ఇలాంటి ఘటనలు జరుగుతాయని మనం అస్సలు ఊహించి ఉండం. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి కరెంట్ స్తంభాలను తాకే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇలా ఓ కుర్రాడు కరెంట్ స్తంభాన్ని పట్టుకొని అక్కడిక్కడే కూలపడ్డాడు. అక్కడ ఉన్న మరో వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి అక్కడే ఉన్న కర్ర సహాయంతో అతడిని బయటకు లాగాడు.

ఈ ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న సదుల్‌పూర్ తాలూకా నుహంద్ అనే గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన అదిల్ అనే ఆరేళ్ల పిల్లాడు తన స్నేహితుడైన మరో బాలుడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నాడు. సరాదగా మాట్లాడుకుంటూ వస్తుండగా.. ఎదురుగా ఉన్న ఓ కరెంట్ స్తంభాన్ని అందులో ఒక పిల్లాడు పట్టుకున్నాడు.

అది గమనించని మరో బాలుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అటు నుంచి వస్తున్న మరో వ్యక్తి ఆ బాలుడికి కరెంట్ షాక్ తగిలిందని గ్రహించాడు. వెంటనే అతడు పక్కనే ఉన్న ఓ చెక్కను తీసుకొని వచ్చి ముందుగా అతడి చెయ్యిపై కొట్టాడు. ఆ తర్వాత ఆ బాలుడిని పక్కకు గుంజాడు. మరికొంతమంది వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఓ వాహనంలో ఎక్కించారు.

అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన అతడిని ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. వర్షాకాలంలోనే కాదు.. ఎప్పుడైనా కరెంట్ స్తంభాలను పట్టుకోవడం అనేది మంచిది కాదంటూ.. కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతడి శరీరం నుంచి పొగలు రావడంతో ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉండే ఉండొచ్చు అనేది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.