Tag Archives: rajasthan

Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ వివాహం… రోజుకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలిస్తే షాక్..?

Sharwanand: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ ఇటీవల రక్షిత రెడ్డి అనే యువతిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ సెలెబ్రెటీలు హాజరయ్యారు. అయితే మీరు నిశ్చితార్థం జరిగే ఐదు నెలలు పూర్తయినా కూడా పెళ్లి గురించి ప్రస్తావన రాకపోవటంతో శర్వానంద్ ,రక్షిత రెడ్డి మధ్య విభేదాలు వచ్చి నిశ్చితార్థం రద్దు చేసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో తాజాగా వీరి వివాహానికి డేట్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 2, 3 తేదీల్లో శర్వానంద్, రక్షిత రెడ్డి వివాహ వేడుక ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ వేదిక కానుంది. జూన్ 2న ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనుండగా.. జూన్ 3 న వివాహం జరగనుంది.

అయితే రెండు రోజులపాటు జరిగే ఈ వివాహ వేడుక కోసం శర్వానంద్ భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా జైపూర్ లోని లీలా ప్యాలెస్‏లో వివాహ వేడుకలు నిర్వహించాలంటే పెద్ద మొత్తంలోనే ఖర్చవుతుంది. రెండు రోజులు పాటు జరిగే శర్వానంద్ వివాహ వేడుక కు ఒక్కో రోజుకు దాదాపురూ. 4 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Sharwanand: రోజుకు నాలుగు కోట్లు…


వీరి వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలీజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ మొత్తానికి జూన్ మూడవ తేదీ వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఒక ఇంటివాడు కాబోతున్నాడు. దీంతో శర్వానంద్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Aamir Khan: అమీర్ ఖాన్ పరిస్థితి ఏంటి ఇలా మారింది.. అందుకే సినిమాలకు దూరంగా ఉంటానన్నాడా?

Aamir Khan: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అమీర్ ఖాన్ పరిచయం అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదాకు చేరుకున్నాడు. తన నటనతో మంచి మార్కులు సంపాదించుకొని హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక ఈయన గతంలో వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా అమీర్ ఖాన్ కి సంబంధించిన ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే తాజాగా రాజస్థాన్ జైపూర్ లో ది వాల్డ్ డిస్నీ కంపెనీ ఇండియా, స్టార్ ఇండియా అధ్యక్షుడు కే మాధవన్ కుమారుడి పెళ్లి జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు బాలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. స్టార్ హీరోలు సైతం తమ ఫ్యామిలీ లతో పాల్గొని బాగా సందడి చేశారు.

అయితే ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అందులో అమీర్ ఖాన్ కూడా ఉండగా ఈయనపై అందరూ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందులో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించగా.. ఆయన వాక్ స్టిక్ సాయంతో నిలబడినట్లు కనిపించాడు. దీంతో ఆయనను చూసిన తన అభిమానులు అమీర్ ఖాన్ కు ఏమయ్యింది అంటూ ఆందోళన చెందుతున్నారు.

Aamir Khan:

ఆయన కాలికి ఏమైనా దెబ్బ తగిలిందా అని భయపడుతున్నారు. మరి కొంతమంది ఆయన కావాలని నటిస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఇటీవలే ఈయన సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంటున్నాను అని చెప్పటంతో.. బహుశా ఆయన కాలు సరిగ్గా లేనందుకే బ్రేక్ తీసుకుంటున్నాడేమో అని అనుకుంటున్నారు.

సరదాగా నడుచుకుంటూ వెళ్లిన ఆ బాలుడు కరెంట్ పోల్ ను తాకాడు.. తర్వాత ఏమైందంటే..

ప్రమాదవశాత్తు ఇలాంటి ఘటనలు జరుగుతాయని మనం అస్సలు ఊహించి ఉండం. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి కరెంట్ స్తంభాలను తాకే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇలా ఓ కుర్రాడు కరెంట్ స్తంభాన్ని పట్టుకొని అక్కడిక్కడే కూలపడ్డాడు. అక్కడ ఉన్న మరో వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి అక్కడే ఉన్న కర్ర సహాయంతో అతడిని బయటకు లాగాడు.

ఈ ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న సదుల్‌పూర్ తాలూకా నుహంద్ అనే గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన అదిల్ అనే ఆరేళ్ల పిల్లాడు తన స్నేహితుడైన మరో బాలుడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నాడు. సరాదగా మాట్లాడుకుంటూ వస్తుండగా.. ఎదురుగా ఉన్న ఓ కరెంట్ స్తంభాన్ని అందులో ఒక పిల్లాడు పట్టుకున్నాడు.

అది గమనించని మరో బాలుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అటు నుంచి వస్తున్న మరో వ్యక్తి ఆ బాలుడికి కరెంట్ షాక్ తగిలిందని గ్రహించాడు. వెంటనే అతడు పక్కనే ఉన్న ఓ చెక్కను తీసుకొని వచ్చి ముందుగా అతడి చెయ్యిపై కొట్టాడు. ఆ తర్వాత ఆ బాలుడిని పక్కకు గుంజాడు. మరికొంతమంది వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఓ వాహనంలో ఎక్కించారు.

అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన అతడిని ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. వర్షాకాలంలోనే కాదు.. ఎప్పుడైనా కరెంట్ స్తంభాలను పట్టుకోవడం అనేది మంచిది కాదంటూ.. కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతడి శరీరం నుంచి పొగలు రావడంతో ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉండే ఉండొచ్చు అనేది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

కూరగాయలు కోసే కత్తితో కోడలు తన అత్తను 26 చోట్ల పొడిచింది.. ఎందుకు ఇలా జరిగిందంటే..!

కొన్ని కుటుంబాల్లో అత్తాకోడళ్లు తల్లి కూతురులా ఉంటారు. మరి కుటుంబాల్లో అత్తా కోడళ్ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గమనేలా ఉంటారు. అయితే తన కొడుకు ముందు కోడలు అత్తతో బాగానే మెసులుతుంది. భర్త అలా వెళ్లగానే ఏదో ఒక చిన్న కారణంతో మళ్లీ రణరంగం మొదలవుతుంది. ఇలా గుంటూరు జిల్లాలో చపాతీ కర్రతో అత్త పై దాడి చేసిన ఘటన మరువకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జైపూర్లోని భంక్రోటాకు చెందిన అత్తాకోడళ్లు.. 62 ఏళ్ల మోహిని దేవి.. తన కుమారుడికి 14 ఏళ్ల కిందట 35 ఏళ్ల మమతా దేవితో తో వివాహం జరిపించింది. మొదట్లో వారిద్దరు బాగానే ఉన్నా.. రానురాను మరింత వైరం పెరిగింది. ఒకరంటే.. ఒకరికీ అస్సలు పడేది కాదు.

ఈ నేపథ్యంలో ఓ రోజు కోడలు కూరగాయలు కోస్తుండగా.. అదేం కూరగాయలు కోసుడు.. మంచిగా కొయ్యి అంటూ .. కోడలిపై రుసురుసులాడింది. దీంతో ఆమెకు పట్టలేని కోపం వచ్చింది. ఇక తట్టుకోలేని కోడలు క్షణికావేశంలో కూరగాయలు కోస్తున్న కత్తితోనే అత్త పై దాడికి పాల్పడింది. ఏకంగా ఇరవై ఆరు చోట్ల పొడవడంతో మోహిని దేవి కి తీవ్ర గాయాలయ్యాయి.

ఒక్కసారిగా ఉలిక్కిపడిన కోడలు.. తన పిల్లలకు తీసుకొని అక్కడ నుంచి పారిపోయింది. చుట్టుపక్కల ఉన్న స్థానికులు అతడి కొడుకుకు సమాచారం అందించడంతో ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించాడు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు మరణించింది. భర్త ఫిర్యాదు మేరకు మమతను పోలీసులు అరెస్టు చేశారు.

16 ఏళ్ల మైనర్ బాలికపై.. ఐదుగురు యువకుల అత్యాచారం.. చివరకు ఆ బాలిక..!

ప్రతీ రోజు ఏదో ఒక ప్రదేశంలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల వార్తలు వింటూనే ఉన్నాం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వాళ్లు మాత్రం మారడం లేదు. అదే కోవలో వెళ్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో.. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది రాజస్థాన్ లో జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్ రాష్ట్రం నాగపూర్ జిల్లాకు చెందిన 16ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన పక్కింటి వ్యక్తి హరిప్రసాద్ ఏదో పని ఉందని.. ఇంటికి పిలిచాడు. తెలిసిన వాడే కదా అని ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్కడకు వెళ్లిన ఆ బాలికకు అతడితో పాటు .. మరో నలుగురు వ్యక్తులు కూడా కనిపించారు. ఆమె ఇంట్లోకి రాగానే తలుపు వేశాడు హరిప్రసాద్.

ఆమె కేకలు వేయడంతో నోరు మూశారు. తర్వాత ఐదుగురు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు.. తర్వాత ఆ బాలికను ఇంటికి పంపించారు. ఆమె ప్రవర్తనలో ఆ రోజు నుంచి మార్పు వచ్చింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆ బాలికపై అనుమానం వచ్చింది.

ఆ బాలికను తల్లిదండ్రులు గట్టిగా నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ ఐదుగురిలో ఒకరు మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ.. చివరికి?

పెళ్లయి భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబంలోకి పెను తుఫానులా ఓ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి రాకతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. వచ్చిన వ్యక్తితో సదరు మహిళ వివాహేతర సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్తను వదిలిపెట్టి, కన్నబిడ్డను కానరాని లోకాలకు పంపించిన ఘటన రాజస్తాన్‌లో జైపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

జైపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సుమిత్ అహీర్, టీనా దంపతులకు నాలుగు సంవత్సరాల కూతురు ఉంది. టీనా అనుకోకుండా ఫోన్ ద్వారా ప్రహ్లాద్‌(45) అనే వ్యక్తికి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే టీనా తన భర్తను వదిలి తన కూతుర్ని తీసుకుని ప్రియుడితో వెళ్లి పోయింది.

టీనా తన ప్రియుడితో కలిసి జైపూర్ రూర‌ల్ ప‌రిధిలోని ఉద‌వల గ్రామంలో నివసిస్తుంది. ఈ క్రమంలోనే టీనా భర్త తన భార్య పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు . ఈ క్రమంలోనే పోలీసులు టీనా ఆచూకీని గుర్తించారు. కానీ తన కూతురి ఆచూకీ మాత్రం తెలియడం లేదు.

తన కూతురు గురించి టీనాని ప్రశ్నించగా బంధువుల ఇంట్లో ఉందని చెప్పింది.ఇదే విషయం గురించి పోలీసులు ఆరా తీయగా పాప అక్కడ లేదని తెలియడంతో ఆమెను గట్టిగా మందలించడంతో అసలు విషయం బయట పెట్టింది. తన కూతురు ఆరోగ్యం బాగా లేకపోతే తనకు వైద్యం చేయించడానికి తన ప్రియుడు డబ్బులు ఇవ్వక పోవడంతో అతనితో కలిసి తన నాలుగు సంవత్సరాల కూతురిని గొంతు నులిమి చంపినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే పోలీసులు టీనా ఆమె ప్రియుడు పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.