ఆధార్ కార్డులో డేట్‌ ఆఫ్ బర్త్‌, జెండర్‌ మార్చుకోవాలా.. ఇలా చేయండి..

ప్రస్తుతం ఆధార్ ప్రాముఖ్యత బాగా పెరిగింది. 12 అంకెల ఈ విశిష్ట గుర్తింపు కార్డును UIDAI సంస్ధ జారీచేస్తుంది. వ్యక్తి సమాచారం తెలుసుకోవటం దీని ద్వారా చాలా ఈజీ. ప్రస్తుతం ఏ పని జరగాలన్నా ఆధార్ కార్డు అనేది ఉండటం తప్పనిసరి అయింది. ఆధార్ వివరాలు నమోదు చేయకపోతే ప్రభుత్వ పథకాలు మొదలు.. అనేక అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే చాలామంది ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏదో ఒక ప్రూఫ్ కావాలని ఆధార్ అప్ డేట్ సెంటర్ సిబ్బంది చెబుతుంటారు.

అడ్రస్ ఫ్రూఫ్ లేకపోవటంతో చాలా మంది ఆధార్ అప్ డేట్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. అదే కాదు ఏ అప్ డేట్ చేయాలన్నా తగిన ప్రూఫ్స్ అనేవి ఉండాలి. అయితే దానిలో పుట్టిన తేదీ, జెండర్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధార్ కేంద్రానికి వెళ్లి ఏమైనా అప్ డేట్ చేయకపోతే 1947 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

అవసరమనుకుంటే వినియోగదారుడు help@uidai.gov.in కు ఒక లేఖ కూడా రాయవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం ఆధార్ కార్డులో S/O లేదా W/O అనే కాలమ్ తీసేశారు. వాటి స్థానంలో C/O కేర్‌ ఆఫ్ అనే కాలమ్‌ చేర్చారు. దీనిలో ఏవరిపైరైనా అప్ డేట్ చేయవచ్చు. దీని అప్ డేట్ కు ఆన్ లైన్ లో కుదరదు. దాని కోసం సమీప ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఏ అప్ డేట్ చేయాలన్నా ఆధార్ కు మొబైల్ నంబర్ ను లింక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఆధార్ కు సంబంధించిన ఏ వివరాలు అయినా తెలుసుకోవచ్చు.