ప్రస్తుతం ఆధార్ ప్రాముఖ్యత బాగా పెరిగింది. 12 అంకెల ఈ విశిష్ట గుర్తింపు కార్డును UIDAI సంస్ధ జారీచేస్తుంది. వ్యక్తి సమాచారం తెలుసుకోవటం దీని ద్వారా చాలా ఈజీ. ప్రస్తుతం ఏ పని జరగాలన్నా ఆధార్ కార్డు అనేది ఉండటం తప్పనిసరి అయింది. ఆధార్ వివరాలు నమోదు చేయకపోతే ప్రభుత్వ పథకాలు మొదలు.. అనేక అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే చాలామంది ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏదో ఒక ప్రూఫ్ కావాలని ఆధార్ అప్ డేట్ సెంటర్ సిబ్బంది చెబుతుంటారు.
అడ్రస్ ఫ్రూఫ్ లేకపోవటంతో చాలా మంది ఆధార్ అప్ డేట్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. అదే కాదు ఏ అప్ డేట్ చేయాలన్నా తగిన ప్రూఫ్స్ అనేవి ఉండాలి. అయితే దానిలో పుట్టిన తేదీ, జెండర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధార్ కేంద్రానికి వెళ్లి ఏమైనా అప్ డేట్ చేయకపోతే 1947 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
అవసరమనుకుంటే వినియోగదారుడు help@uidai.gov.in కు ఒక లేఖ కూడా రాయవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం ఆధార్ కార్డులో S/O లేదా W/O అనే కాలమ్ తీసేశారు. వాటి స్థానంలో C/O కేర్ ఆఫ్ అనే కాలమ్ చేర్చారు. దీనిలో ఏవరిపైరైనా అప్ డేట్ చేయవచ్చు. దీని అప్ డేట్ కు ఆన్ లైన్ లో కుదరదు. దాని కోసం సమీప ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఏ అప్ డేట్ చేయాలన్నా ఆధార్ కు మొబైల్ నంబర్ ను లింక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఆధార్ కు సంబంధించిన ఏ వివరాలు అయినా తెలుసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…