బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఎంతో మందికి సుపరిచితం. అతడు ఎన్నో హిట్ సినిమాలను అందించాడు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ ను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన విషయం తెలిసిదే. 2014 సంవత్సరంలో విడుదల అయిన అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు.
ఆ సినిమాతోనే తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఉత్తమ తొలి చిత్ర నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు (సౌత్)ను కూడా పొందాడు. తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని స్పీడున్నోడు సినిమా తీశాడు. ఆ తర్వాత వరుసగా.. జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ వంటి సినమాల్లో నటించాడు. ప్రస్తుతం వి.వి. వినాయక్ దర్శకత్వంలో చత్రపతి రిమేక్ లో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకూ నటించిన సినిమాల్లో అగ్ర హీరోయిన్స్ కూడా ఇతడి పక్కన నటించడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ ఆస్తి ఎంత, నెలకు ఎంత సంపాదిస్తున్నాడో వంటి విషయాలకు వెళ్తే.. తన తండ్రి నిర్మాత కాబట్టి.. ఇతడి ఆస్తి దాదాపు రూ.250 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంతే కాకుండా రూ.15 కోట్లు విలువ చేసే ఇల్లు, రెండు ఆధునాతన సౌకర్యాలతో.. కొత్త టెక్నాలజీతో కూడిన కార్లు, మరియు సపర్ లగ్జరీ బైక్ లు కలిగి ఉన్నాడు.
ఇతడి రెమ్యూనరేషన్ కూడా తెలిస్తే షాక్ అవుతారు.. అతడు ప్రతీ సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక తన తండ్రి సహాయంతో ఆయన నటించిన కొన్ని సినిమాలు పలు భాషల్లో కూడా విడుదల చేస్తూ, ఎక్కువ అభిమానులను సంపాదించుకునే విధంగా చూస్తున్నారట. అలా కొన్ని సినిమాల శాటిలైట్ రైట్స్ కొనుక్కొని బాగానే డబ్బులు సంపాదిస్తున్నట్లు సినీ వర్గాల టాక్.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…