తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత ఆ తర్వాత అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. గత నాలుగు సంవత్సరాల క్రితం వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయని ఈ క్రమంలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పటి వరకు వీరి విడాకుల విషయంపై ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ వీరు మాత్రం వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక సమంత ప్రస్తుతం ఒంటరిగా చెన్నైలో తన స్నేహితులతో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. అలాగే నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సమంత తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన మెసేజ్ కార్డులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సమంత ఇలా పోస్టులు పెట్టడం వెనుక కారణం ఏమిటి… తను డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా చైతన్యకు మెసేజ్ ల రూపంలో తన మనసులోని భావాలను చెబుతోందా.. లేక క్యాజువల్ గానే ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టిందా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో భాగంగా.. నువ్వు నన్ను బాధ పెట్టి ఉండొచ్చు.. నేను నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు.. ఇలా ఒకరికొకరం బాధ పెట్టుకుని ఉన్నప్పటికీ రియాలిటీ మాత్రం ఇదే… వసంతకాలం రావాలంటే అంతకు ముందు వచ్చే శిశిరాన్ని కూడా భరించాల్సి ఉంటుందనే మెసేజ్ కార్డులు పెట్టడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆలోచనలో పడేసాయి.
ప్రస్తుతం సమంత విడాకుల విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత ఈ విధమైనటువంటి మెసేజ్ చేయడం వెనుక కారణం ఏమిటి?తన భావాలను తన మనసులోని మాటలను ఇలా సమంత తన భర్తకు చేరవేయాలనుకుంటుందా అసలు ఏం జరుగుతోంది అంటూ అభిమానులు మరోసారి ఆలోచనలో పడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…