ఆ దేవాలయంలో అపచారం.. ముదిరిన వివాదం.. ఇంతకు ఏం జరుగుతోంది..?

ఆ దేవాలయంలోని గోశాలలో పాలు విక్రయిస్తున్నారని.. ఇది అపచారం అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఆ దేవాలయం ఎక్కడో కాదు.. విశాఖ సింహాచలం నరసింహస్వామి ఆలయంలో ఈ పని జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజుల క్రితం ఈ వివాదం ఏర్పడడంతో ముదురుతూ వచ్చింది. తాజాగా వీటిపై దేవస్థానం అధికారులు వివరణ కూడా ఇచ్చారు.

ప్రస్తుతం కరోనా సమయంలో అన్నదానాలు నిలిచి పోవడంతో పాలు మిగులుతున్నాయని.. వృధాగా రోజూ పారబోయాల్సి వస్తుందని.. అందుకే దేవాలయ చుట్టుపక్కల వాళ్లకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ దేవాలయంలోని గోశాలలో గత సంవత్సరం ఏప్రిల్ నుంచి రోజూ ఉదయం 7 గంటలకు.. సాయంత్రం 5 గంటలకు దేవస్థానం అవసరాలకు పోగా మిగిలిన పాలను విక్రయిస్తున్నారు.

విశాఖ సింహాచలం నరసింహస్వామి దేవాలయ ఈఓ దేవస్థానంకు ఉపయోగించాల్సిన పాలను ఇంటికి తీసుకెళ్లాడని.. ఇది అపచారం అంటూ అనడం ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ లీటరు పాలను రూ.40 కు విక్రయిస్తున్నారు. ఎవరికీ ఉచితంగా పాలను విక్రయించడం లేదని తెలిపారు. అలా విక్రయించగా వచ్చిన డబ్బులను దేవస్థానం అకౌంట్లోనే డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు దేవస్థానం అధికారులు.

పాలను విక్రయించడం వల్ల రోజుకు సుమారు రూ.800 వస్తున్నట్లు తెలిపారు. మిగిలిన పాలను ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇందులో అపచారాలు, అన్యాయాలేమీ లేవని ఆలయ అధికారులు అంటున్నారు. అక్కడ చుట్టు పక్కల ఉన్న దేవాలయాలకు, ఉపదేవాలయాలకు పాలను పంపించిన తర్వాతనే మిగిలిన పాలను అమ్ముతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.