రామ్ గోపాల్ వర్మ ఎక్కడ కాంట్రవర్సీ ఉంటుందో అక్కడే ఉంటాడు. ఇతని గురించి తెలియకుండా తెలుగు ప్రేక్షకుడే కాదు.. దక్షిణ భారతదేశంలో కూడా ఎవరూ ఉండరు. అంతగా పాపులారిటీ తెచ్చుకున్నారు ఆర్జీవీ. ఒకప్పుడు దర్శకత్వంలో తన మార్క్ ను చూపించిన వర్మ ప్రస్తుతం వివాదాలే అతడి టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.
ఇటీవల అమ్మాయిలతో తాగి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలు చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. సందర్భం ఏదైనా, పరిణామాలు ఏవైనా అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటాడు వర్మ. ఎప్పటికప్పుడు సెన్సేషనల్ కామెంట్స్, ట్వీట్స్ చేస్తూ అటెన్షన్ తనవైపు తిప్పుకుంటాడు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే మెగా ఫ్యామిలీపై అతడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా అతడు మెగా ఫ్యామిలీపై మరోసారి రెచ్చిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును చిరు ఇంట్లో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే అదే రోజు రాఖీ పౌర్ణమి కూడా రావడంతో చాలామంది ఆ వేడుకకు హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ అంతా ఆ వేడుకకు హాజరు కాగా కొన్ని కారణాలతో అల్లు అర్జున్ హాజరు కాలేకపోయారు.
దీనిని ఆర్జీవీ టార్గెట్ చేసి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. వేడుకకు హాజరైన వాళ్లంతా చిరంజీవి సపోర్టుతో పైకి వచ్చారని.. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే స్వయంకృషితో పైకి వచ్చారటూ ట్వీట్ చేశారు. ఒక్క అల్లు అర్జున్ తప్ప మిగతా మెగా ఫ్యామిలీ అంతా పరాన్న జీవులని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. దీనిపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…