ఇంటి ఆవరణలో ఏ మొక్కలు పెంచాలి.. ఏ మొక్కల వల్ల లాభం కలుగుతుందో తెలుసుకుందాం..!

ఇంటి వాస్తు సరిగా ఉంటేనే దాంపత్య జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది అని చాలా మంది భావిస్తారు. అయితే వాస్తును నమ్మేవారు చాలా మంది ఉన్నారు. పెరట్లో కొంతమంది మొక్కలను ఎక్కువగా నాటుతుంటారు. మొక్కలు మానసిక ప్రశాంతతో పాటు చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అయితే ఇంటి ఆవరణలో ఏ మొక్కలు పెంచాలి.. ఇంటి లోపల ఏ మొక్కలు ఉండకూడదో కొంత మందికి తెలియదు.

వాటి గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం చింత చెట్టు అనేది ఇంట్లో నాటకూడదు. ఇది మన ఆనందాన్ని హరిస్తుంది. కొంతమంది తమ ఇంటి ఆవరణలో కాక్టస్ మొక్కలను నాటుతుంటారు. కానీ ఈ మొక్కల ద్వారా మీ ఇంటికి నష్టమే తప్ప లాభం ఉండదని వాస్తు శాస్త్రం చెబుతోంది. గౌడ కులస్తులకు జీవనాధారం అయిన తాటి చెట్టును కూడా ఇంట్లో నాటకూడదు. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇంట్లో పెంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వెదురు చెట్లను కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు. హిందూ విశ్వాసం ప్రకారం.. ఈ వెదురు కట్టెలను మరణించిన వ్యక్తిని కాల్చడానికి ఉపయోగిస్తారు. అందువల్ల ఇది అరిష్టానికి సంకేతంగా వాస్తు శాస్త్రం పేర్కొంది. దేవాలయాల్లో రావి చెట్టు అనేది ఎక్కువగా కనిసిస్తుంటుంది. అందుకే మన ఇంట్లో ఉంటే కూడా శుభం కలుగుతుందని భావిస్తుంటారు కొంతమంది.

కానీ ఇంట్లో రావి చెట్టును పెంచకూడదు. ఇది మీకు ధన ప్రాప్తి నుంచి దూరం చేయగలదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇదిలా ఉండగా.. సిట్రస్ మొక్క, కలబంద, అరటి చెట్టు, లిల్లీ మొక్క, పాము మొక్క, లావెండర్, మనీ ప్లాంట్, తులసి, వేప చెట్టు, లక్కీ వెదురు మొక్క లాంటివి ఇంటి ఆవరణలో ఉంటే ఇక అదృష్టం వరిస్తుందని వాస్తు శాస్ర్తం చెబుతోంది.