సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలకు కారణం అదేనా.. చలపతిరావు సంచలన వ్యాఖ్యలు..

సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ అగ్రహీరోలుగా గత 40 ఏళ్ల క్రితం తన సత్తాను చాటిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య గతంలో విభేదాలు ఉన్నాయనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీని గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంటంటే.. తాజాగా చలపతిరావు ఓ ఇంటర్య్వూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఏంటంటే.. అతడు అప్పట్లో మూడు పూటలు పనిచేసేవాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య పోటీ విపరీతంగా ఉండేదని కూడా చెప్పారు. వాళ్ళిద్దరూ కలిసి 12 సినిమాలు చేశారని తెలిపారు.

ఇది ఒక రికార్డ్ అని కూడా ఆయన తెలిపాడు. ఇప్పటికాలంలో 12 సినిమాలు ఎవరూ కలిసి చేయలేదని చలపతిరావు అన్నారు. అసలు ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు రావడానికి గల కారణం గురించి అయన ఇలా చెప్పాడు. ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ సినిమా తీస్తున్నప్పుడు.. కృష్ణ కూడా కురుక్షేత్రం సినిమా తీస్తున్నారు. అయితే అక్కడ రెండు సినిమాల్లో ఒక్కటే సబ్జెక్ట్ ఉండటం విశేషం.

ఒకటే సబ్జెక్ట్ ఉన్న సినిమా తేయొద్దని కృష్ణకు ఎన్టీఆర్ చెప్పినా వినలేదని చలపతి రావు అన్నారు. కృష్ణ వినకపోవడంతో అక్కడి నుంచే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి అని తెలిపాడు. అయితే సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశాక దానవీరశూరకర్ణ సినిమా సూపర్ హిట్ కాగా.. కురుక్షేత్రం డిజాస్టర్ గా నిలిచింది. దానవీరశూరకర్ణ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ నటన సినిమాను హిట్ వరకు తీసుకెళ్లిందని చలపతిరావు అన్నారు.

అంతేకాకుండా ఎన్టీఆర్ సింహబలుడు అనే జానపద చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో కూడా కృష్ణ సింహ గర్జన అనే జానపద చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సమయంలో కూడా వద్దన్నా వినకుండా సినిమా తీసి రిజీల్ చేశారు. కానీ అప్పుడు రెండు సినిమాలు పెద్ద హిట్ కొట్టాయి. ఈ సనిమాల్లోని ఇగో కారణంగానే వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చినట్లు చలపతిరావు ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.