పోర్నోగ్రఫీ కేసులో భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న శిల్ప శెట్టి కుటుంబం.. తాజాగా మరో వివాదంలో ఇర్కుకుంది. శిల్పా, ఆమె తల్లి తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. దీంతో శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీ నేతృత్వంలోని ఓ బృందం ముంబై చేరుకుంది.
శిల్పాశెట్టి అయోసిస్ వెల్‌నెస్ అండ్ స్పా పేరుతో ఫిటినెస్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఈ సంస్ధకు శిల్ప చైర్మన్‌గా ఉండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సంస్థ విస్తరణలో భాగంగా మరో బ్రాంచ్‌ను లక్నోలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరికి వారి ఫ్రాంచెజ్ నెలకొల్పడానికి అనుమతి ఇచ్చి ఇరువురు దగ్గర నుండి కోటికి పైగా డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత ప్రాంఛైజీ విషయంలో శిల్ప నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. తల్లి,కూతుళ్ళు తమను మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…