Featured

సౌందర్య ఎంట్రీ.. కార్తీకదీపంలో దద్దరిల్లిపోయే మలుపు.. ఏమిటంటే?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది. గత ఎపిసోడ్ లో మోనిత తన చేసిన కుట్రలన్నీ కార్తీక్ కు చెప్పడంతో కార్తీక్ తనని చంపేస్తానని నన్ను గురి పెడతాడు. అయితే కార్తీక్ నిజంగానే మోనితను చంపాడా? అనే విషయాలను నేడు 1114 వ ఎపిసోడ్ లో చూడవచ్చు. మరి ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో తెలుసుకుందాం… నేటి ఎపిసోడ్ లో మోనిత తలకు గన్ గురిపెట్టి నా ప్రేమ కోసం ఇన్ని దారుణాలు చేశావు కదా ఏ ప్రేమ కోసమే అయితే నువ్వు ఉన్మాదిలా మారావో ఆ ప్రేమ కోసమే చచ్చిపో.. నువ్వు ప్రేమించిన మనిషి చేతిలోనే చచ్చిపో… అంటూ కార్తీక్ అనగానే తుపాకీ పేలిన శబ్దం వినబడుతుంది. ఆ తరువాత మోనిత కార్తీక్.. అని అరుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని సస్పెన్స్ గా పెట్టేసారు.

దీప డాక్టర్ బాబు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.భారతి ఫ్రెండ్ చనిపోయిందని చెప్పిన వెళ్లిన డాక్టర్ బాబు ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉండగా కార్తీక్ వస్తాడు… ఎంతో డీలాగా ఉన్న కార్తీక్ ని చూసి దీప కంగారు పడి ఏమైంది అని ప్రశ్నిస్తుంది. నాకేమైంది నేను బాగున్నాను..వందేళ్ల తర్వాత కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ బాధపడతాడు. ఇవన్నీ తెలిసిన తర్వాత నా మీద నాకే చాలా కోపంగా ఉంది. అలసిపోయాను దీప ఈ వయసుకే వందేళ్ల జీవితం అనుభవించినటు వందేళ్ల వేదనను ముప్పై సంవత్సరాలలోనే అనుభవించాను బాధపడతాడు.

కార్తీక్ అలా మాట్లాడటంతో దీప కంగారు పడుతుంది నాలాంటి వాడు బతకడం వేస్ట్.. నాలాంటి వాళ్ళు బతుక కూడదు చచ్చిపోవాలి జీవితంలో ఒంటరివాడిని అనే ఫీలింగ్ కలుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు దీప నీక తోడుగా నేనున్నాను అని చెప్పడంతో ఎప్పుడు ..ఉన్నావు నా జీవితంలో నీతోడు అవసరమైనప్పుడు నువ్వు లేవు.. నా జీవితం ఇలా అవ్వడానికి కారణం నువ్వంటూ దీపను అంటాడు. నీ కడుపులో పెరుగుతున్న పిల్లలకు తండ్రి నేను కాదని చెప్పినప్పుడు లాగి చెంపపై ఒకటి కొట్టి.. డీఎన్ఏ టెస్ట్ కి తీసుకు వెళ్ళి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు కదా. కానీ నువ్వు ఆ పని చేయలేదు గడప దాటి బయటకు వెళ్ళిపోయావు. అమ్మ ఒంటరిగా ఉన్న నా పక్కన కాకుండా నీ పక్కన ఉంటూ నీకు సహాయం చేసింది. ఇక నా బిడ్డను నేను దత్తత తీసుకొని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రౌడీనీ అయితే ఒక పరాయి పిల్లలాచూశాను. నాకు మంచి పిల్లలు ఉన్నారు వారి పదేళ్లు బాల్యాన్ని చిదిమి వేయడానికి కారణం నువ్వు, మా అమ్మ అంటూ బాధపడతాడు.

ఇంట్లో అందరూ ఇలా వెలి వేసినప్పుడు ఒంటరినయ్యాను ఈ క్రమంలోనే ఓదార్పు కోసం మోనితను దగ్గరకు వెళ్లాను. కానీ అక్కడే మోసపోయాను అంటూ బాధపడతాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల నుంచి వేధిస్తున్న ప్రశ్న మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం నేను కాదు అని ఎన్నోసార్లు చెప్పాను. అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఈ రోజు దొరికింది. అసలు మోనిత ఎలా గర్భవతి అయిందో తెలుసా? ఆదిత్య నన్ను రెచ్చగొట్టి డీఎన్ఏ టెస్ట్ కి పంపించాడు. ల్యాబ్లో శాంపుల్ ఇచ్చినప్పుడు ఆ శాంపిల్స్ ద్వారా మోనిత గర్భవతి అయింది. కృత్రిమ గర్భధారణ అంటూ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. అసలు మోనిత కడుపు రావడానికి కూడా కారణం ఆదిత్య అంటూ బాధపడతాడు. ఇప్పుడు చెప్పు ఇంత మోసం చేసిన ఆ మోనితను చంపేయాకనిపిస్తుందా.. లేదా..

కట్ చేస్తే ఆనందరావు కార్తీక్ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. తనని చూడటానికి వెళ్లాలని ఆదిత్యతో చెబితే ఆదిత్య అందుకు సరే అంటాడు. కార్తీక్ ,దీప ఏసిపి రోషిని కలవడానికి వెళుతుంటారు. అప్పుడే రోషిని ఎంటర్ అవుతుంది. రండి మేడమ్ మేమే మీ దగ్గరకు రావాలి అనుకుంటున్నాము అని దీప అనడంతో… ఎందుకు సరెండర్ అవ్వడానికా.. కార్తీక్ మోనితను ఎక్కడో దాచి పెట్టావో చెప్పు తన శవం ఎక్కడ అంటూ ప్రశ్నిస్తారు. దీంతో దీపా కార్తీక్ ఇద్దరు షాకవుతారు. అసలే మాట్లాడుతున్నారు మేడం అని దీప అనగా కార్తీక్ మోనితను ఎక్కడ దాచి పెట్టావని ప్రశ్నిస్తుంది. ఈ క్రమంలోనే ఎపిసోడ్ పూర్తవుతుంది. తర్వాత ఎపిసోడ్ లో కార్తీక్ ని తీసుకెళ్లి జైల్లో పెడతారు పిల్లలిద్దరూ తన తల్లితో అసలు నాన్నని ఎందుకు అరెస్టు చేశారు.. నాన్న ఎప్పుడు వస్తాడు అమ్మ అంటూ దీపని నిలదీస్తారు. కట్ చేస్తే జైల్లో కార్తీక్.. ఏసీపీ రోషిని ముందు సౌందర్య ఎంట్రీ ఈ రివాల్వర్ నాది తనను నేనే చంపాను నా పై ప్రేమతో నా కొడుకు సరెండర్ అయ్యారు. నన్ను అరెస్టు చేసి నా కొడుకును వదిలిపెట్టండి అంటూ అసలు ట్విస్ట్ ఇస్తుంది. అయితే మోనితను చంపింది ఎవరు? కార్తీక్ బయటకు వస్తాడా? అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago