చిరంజీవి రోజుకు ఎన్ని లక్షలు సాయం కోసం వేచ్చిస్తారో తెలుసా?

మెగస్టార్ చిరంజీవి గురించి పాజిటీవ్ గా చెప్పేవాళ్లు ఉంటారు తప్ప నెగెటివ్ గా చెప్పేవారు చాలా తక్కువ మంది. ఎందుకంటే అతడు చేస్తున్న సేవలే అతడి మంచితనానికి నిదర్శనం. అయితే మెగస్టార్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మందికి ఆదర్శం కూడా. అయితే ఇటీవల విడుదలైన క్రేజీ అంకుల్స్ సినిమా ప్రమోషన్లో భాగంగా రాజా రవీంద్ర కొన్ని ఆసక్తికరమైన విషయాలను చిరంజీవి గురించి చెప్పారు.

సినీ పరిశ్రమలోనే కాదు బయట వ్యక్తి కూడా కష్టాల్లో ఉన్నాడంటే ముందు ఉండే వారిలో చిరంజీవి ఒకరు అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టినా చిరంజీవి ఎంతో సింపుల్ గా ఉంటారని.. సహాయం చేసి కూడా ఎవరికీ చెప్పవద్దనే చెప్పే సహాయ గుణం గలవారని ప్రశంసింస్తూ.. చిరంజీవి చేసిన సేవల గురించి రవీంద్ర చెప్పారు.

కోవిడ్ టైంలో ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే.. తన సొంత ఖర్చుతో వ్యాక్సిన్ కొని వేయించాడన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలిచాయన్నాడు. హేమ డెలివరీ సమయంలో ఎంతో బ్లడ్ కావాల్సి వచ్చిందని.. మెగస్టార్ ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ సహాయం చేసిందని ఆయన గుర్తు చేశాడు. అతడు కేవలం బ్లడ్ బ్యాంకు కోసమే రూ.20 లక్షల వరకు ఖర్చు పెడతారని అన్నారు.

తొమ్మిది సంవత్సరాలు రాజకీయంలో ఉండి మళ్లీ సినిమాలోకి రావడానికి తన బాడీని మార్చుకోవడం కోసం ఎంతో డెడికేషన్ తో వర్క్ చేశాడని అన్నారు. అంత డెడికేషన్ ఉన్న మనిషిని తాను ఎక్కడా చూడలేదని అన్నారు. రాజా రవీంద్ర చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలోలో వైరల్ గా మారాయి.