టిక్ టాక్ పుణ్యమా అని ఇండియాలో ఎంతో కొంత టాలెంట్ ఉన్నవాళ్లు సినీ ఇండస్ట్రీలో కొంతమందికి మంచి అవకాశాలే వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఓ టిక్ టాక్ స్టార్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి అర్థరాత్రి పోలీసులకు పంపించారు. కంగారు పడిన పోలీసులు ఇంటికి వెళ్లి చూసేసరికి షాక్ కు గురయ్యారు.
ఇంతకు అక్కడ ఏం జరిగిందో.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. టిక్‌టాక్‌తో గుర్తింపు తెచ్చుకున్న సూర్య దేవి తమిళనాడు తిరుచ్చి జిల్లా మనప్పరాయిలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. టిక్ టాక్ యాప్ నిషేధం విధించిన తర్వాత కూడా పబ్లిసిటీ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. మధురై సుబ్రమణ్యపురం మార్కెట్ ప్రాంతానికి చెందిన సిక్కా అనే వ్యక్తి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తనపై దాడి చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది.
దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియో తీసి ఆమె పోలీసులకు పంపించింది. అర్థరాత్రి ఈ వీడియో పంపిండగా… కంగారు పడిన పోలీసులు హుటాహుటిన ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లారు. అక్కడ బయట తలుపులు వేసి ఉన్నాయి. పోలీసులు ఆ తలుపులను పగలగొట్టి లోపలకి వెళ్లి చూడగా.. పోలీసులు షాక్ అయ్యారు. ఆమె గాఢ నిద్రలో ఉడటం గమనించారు.
ఈ తతంగం మొత్తం జరుగుతుండగా అక్కడికి చుట్టుపక్కల వారు మొత్తం వచ్చారు. ఆమె చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్లతో పాటు పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా సూర్య దేవి పబ్లిసిటీ కోసమే చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పనికి ఆ కాలనీ వాసులు అంతా ఆమెను మందలించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…