జయంతి మూడు పెళ్లిళ్లు చేసుకొని ఆ మూడు కూడా పెటాకులు చేసుకున్నారని మీకు తెలుసా?

సినిమా ఇండస్ట్రీ లో పనిచేసే ఎంతో మంది సెలబ్రిటీలు సినీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండి ఎంతో మంది ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నారు.ఈ విధంగా సినీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతోమంది నటీనటులు నిజ జీవితంలో మాత్రం ఉన్నత స్థానంలో ఉండలేక ఎన్నో బాధలు అవమానాలు పడిన వారు కోకొల్లలు ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఎన్నో కారణాల వల్ల విడిపోయి ఒంటరిగా బతుకుతున్న సెలబ్రిటీలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి వారిలో సీనియర్ నటి జయంతి ఒకరు.

నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జయంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ భాషలలో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె సినీ జీవితంలో సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ నిజ జీవితంలో మాత్రం తన జీవితాన్ని ఉన్నతస్థానంలో నిలుపుకోలేక పోయింది.

జయంతి నిజజీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ తన వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోలేక చివరి రోజుల వరకు ఒంటరిగా జీవించి తుది శ్వాస విడిచారు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న జయంతి నటుడు పేకేటి శివరామ్‌ను పెళ్లి చేసుకున్నారు. జయంతిని పెళ్లి చేసుకోవడానికి మునుపే ఆయనకు పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ విషయాన్ని దాచి పెట్టి ఇండస్ట్రీలో అప్పుడప్పుడే ఎదుగుతున్న జయంతిని ప్రేమలో దింపి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. అప్పట్లో వీరి ప్రేమపెళ్లికి ఎన్టీఆర్ ఏఎన్నార్ కూడా మద్దతు తెలిపారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే వీరికి ఒక బాబు పుట్టిన తర్వాత శివ రామ్ జయంతిని తన చెప్పుచేతుల్లో తీసుకోవాలని చూశాడు. ఈ క్రమంలోనే వీరికి మనస్పర్ధలు రావడంతో అతని నుంచి విడిపోయి సినిమాలలో బిజీగా ఉన్న జయంతికి బండారు గిరిబాబు అనే నిర్మాతతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త పెళ్లికి దారితీసింది.గిరిబాబుకి కూడా అప్పటికే వివాహం జరిగి ఉండగా పలు గొడవలు కారణంగానే కొన్ని రోజులకే వీరిద్దరు విడిగా ఉన్నారు. ఆ తర్వాత కన్నడంలో యంగ్ హీరో రాజశేఖర్ ప్రేమలో పడ్డారు జయంతి. తనకన్నా వయసులో చిన్నవాడైనప్పటికీ పలువురు సహాయంతో తనని పెళ్లి చేసుకున్నారు. తనని హీరోగా నిలబెట్టడానికి కోసం ఎంత డబ్బులు కూడా ఖర్చు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడకపోవడంతో రాజశేఖర్ నుంచి దూరమైన జయంతి చివరివరకు ఒంటరిగానే బతుకుతూ చివరి రోజుల్లో ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ మరణించారు.