Actress Laya: నటి లయ సినిమాలకు దూరం కావడానికి అదే కారణమా… అసలు విషయం చెప్పిన నటి!

Actress Laya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి లయ ఒకరు.స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లయ మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. అనంతరం ఈమె నటించిన మనోహరం ప్రేమించు సినిమాలకు వరుసగా నంది అవార్డులు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు.

ఇలా ఇండస్ట్రీలో దాదాపు 13 సంవత్సరాల పాటు వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి లయ ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి లయ తాను ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.

తాను ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే తనకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది. దాంతో తాను పెళ్లి చేసుకున్నానని పెళ్లి చేసుకోవడం వల్ల సినిమాలకు దూరమయ్యానని తెలిపారు.అయితే తన భర్త తనని ఎప్పుడూ కూడా సినిమాలు చేయొద్దు అని చెప్పలేదని ఇప్పటికీ తను చేసే రీల్స్ అన్నింటిని కూడా తన భర్త షూట్ చేస్తారని తెలిపారు.

Actress Laya: కష్టపడి పైకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ వదిలి వెళ్లడం చాలా కష్టం…

పెళ్లి తర్వాత కూడా తన భర్త సినిమాలలో నటించమని చెప్పారు అయితే పెళ్లి అయిన తర్వాత తన భర్త యుఎస్ లో ఉండటం, తాను ఇక్కడ సినిమాలలో నటిస్తూ ఉండడంతో ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయడం ఇబ్బంది అవుతుందన్న కారణంతోనే తాను సినిమాలకు దూరమయ్యానని తెలిపారు.కష్టపడి ఇండస్ట్రీలో ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత అన్ని వదిలేసుకుని వెళ్లిపోవడం అంటే కొంచెం కష్టమైన పనే అంటూ ఈమె తన సినీ కెరీర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.