Actress Laya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి లయ ఒకరు.స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లయ మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. అనంతరం ఈమె నటించిన మనోహరం ప్రేమించు సినిమాలకు వరుసగా నంది అవార్డులు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు.
ఇలా ఇండస్ట్రీలో దాదాపు 13 సంవత్సరాల పాటు వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి లయ ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి లయ తాను ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.
తాను ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే తనకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది. దాంతో తాను పెళ్లి చేసుకున్నానని పెళ్లి చేసుకోవడం వల్ల సినిమాలకు దూరమయ్యానని తెలిపారు.అయితే తన భర్త తనని ఎప్పుడూ కూడా సినిమాలు చేయొద్దు అని చెప్పలేదని ఇప్పటికీ తను చేసే రీల్స్ అన్నింటిని కూడా తన భర్త షూట్ చేస్తారని తెలిపారు.
పెళ్లి తర్వాత కూడా తన భర్త సినిమాలలో నటించమని చెప్పారు అయితే పెళ్లి అయిన తర్వాత తన భర్త యుఎస్ లో ఉండటం, తాను ఇక్కడ సినిమాలలో నటిస్తూ ఉండడంతో ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయడం ఇబ్బంది అవుతుందన్న కారణంతోనే తాను సినిమాలకు దూరమయ్యానని తెలిపారు.కష్టపడి ఇండస్ట్రీలో ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత అన్ని వదిలేసుకుని వెళ్లిపోవడం అంటే కొంచెం కష్టమైన పనే అంటూ ఈమె తన సినీ కెరీర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…