నటి పవిత్రా లోకేష్ భర్త, తండ్రి కూడా నటులనే విషయం మీకు తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో పని చేసే చాలా మంది నటీనటులు ఎక్కువగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వస్తుంటారు. ఈ క్రమంలోనే కెరియర్ మొదట్లో ఆ నటీనటులు హీరో హీరోయిన్లుగా చేసినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, ఇండస్ట్రీని వదులుకోలేక కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నటి పవిత్రా లోకేష్ ఒకరు.

పవిత్రా లోకేష్ మొదట్లో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక స్టార్ డైరెక్టర్ సినిమాలు చేయాలంటే అప్పట్లో కాస్టింగ్ కౌచ్ కారణంగా దర్శకనిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వడం ఇష్టంలేక, ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం ఇష్టంలేక ఈ నటి 30 సంవత్సరాలకే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో చేస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.

పవిత్రా లోకేష్ ఎంతోమంది హీరోలకు ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించి ఎంతో ప్రస్తుతం ప్రతి సినిమాలోనూ తల్లి పాత్రలలో ఎక్కువగా కనబడుతున్నారు. గతంలో సిద్ధార్థ బావ, ఎన్టీఆర్ టెంపర్, అల్లు అర్జున్ రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి శర్వానంద్ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి అద్భుతమైన చిత్రాలలో హీరో తల్లి పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన పవిత్రా లోకేష్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. పవిత్రా తండ్రి మైసూర్ లోకేష్ ఆయన కూడా కన్నడ ఇండస్ట్రీలో ఒక గొప్ప ఆర్టిస్ట్, అలాగే తన సోదరుడు ఆది లోకేష్ కూడా మంచి నటుడే, ఈ విధంగా తండ్రి సోదరుడు మాత్రమే కాకుండా పవిత్రా లోకేష్ భర్త కూడా నటుడు కావడంతో ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారని చెప్పవచ్చు.