కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన “అపరిచితుడు” సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో విక్రమ్, సదా జంటగా నటించారు.ఒకే సినిమాలో మూడు క్యారెక్టర్ లలో నటించిన విక్రమ్ కు ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమా స్క్రిప్ట్ తీసుకొని దర్శకుడు శంకర్ మొట్టమొదటిసారిగా రజనీకాంత్ ని కలిశారు.
ఈ సినిమాలో చేయడం కోసం రజిని ఒప్పుకోకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన శంకర్ ఈ సినిమా కథతో విక్రమ్ ని కలిశారు. ఇక ఈ సినిమా కథ వినగానే విక్రమ్ వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఐశ్వర్యరాయ్ అని శంకర్ భావించారు అయితే ఐశ్వర్య నుంచి కూడా శంకర్ కు చేదు అనుభవం ఎదురైంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో నటించడానికి నో చెప్పడంతో ఈ సినిమాలో సదా హీరోయిన్ గా తీసుకున్నారు.
ఈ విధంగా అపరిచితుడు సినిమా తెరకెక్కింది. విక్రమ్ భార్య సైకాలజీ చదవడం వల్ల మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి విక్రమ్ కు బాగా వివరించేది. ఆరు నెలలో షూటింగ్ పూర్తి చేస్తామని చెప్పిన దర్శకుడు ఈ సినిమాకు దాదాపు సంవత్సర కాలం పట్టింది.ఈ విధంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం గ్రాఫిక్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ కలిపి సుమారు 26 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు.
ఈ విధంగా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకంగా 37 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకొని అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదలయి మంచి విజయం సాధించిన తర్వాత ఈ సినిమాలో నటించినందుకు ఐశ్వర్య చాలా ఫీల్ అయ్యారు.ఈ క్రమంలోనే ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన “రోబో ” సినిమాలో నటించే అవకాశం రావడంతో వెంటనే ఐశ్వర్య ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…