Actress sreeleela: సీనియర్ హీరోయిన్లే ఆ పని చేశారు… నేను చేయడం పెద్ద తప్పేం కాదు: శ్రీ లీల

Actress sreeleela: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి పెళ్లి సందడి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తెలుగులో నాలుగైదు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీలా తాజాగా ఈమె నటించిన దమాక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ క్రమంలోని శ్రీ లీల ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన వృత్తిపరమైన జీవితమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా చర్చించారు. ఇక ఈ ఇంటర్వ్యూలలో భాగంగా హీరో రవితేజ గురించి మాట్లాడుతూ రవితేజ చాలా హై లెవెల్ ఎనర్జీతో ఉంటారని ఆయనని బీట్ చేయడం ఎవరి వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చారు.

ఇకపోతే రవితేజ శ్రీ లీల ఇద్దరి కాంబినేషన్లో సినిమా అని చెప్పినప్పటి నుంచి ఈ జంట గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కూతురు వయసు ఉన్న అమ్మాయితో నటించడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇక ఈ వార్తల గురించి కూడా శ్రీ లీల స్పందించారు. ఇండస్ట్రీలో నాకన్నా ఎంతో మంది సీనియర్ హీరోయిన్లు తమకన్నా వయసులో చాలా పెద్దవారైన హీరోలతో నటించారు. వారి ముందు నేనెంత అంటూ ఈమె ఆ వార్తల గురించి కూడా స్పందించి కామెంట్స్ చేశారు.

Actress sreeleela: ఏజ్ గ్యాప్ గురించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన శ్రీ లీల..

ఇక రవితేజతో సినిమా చేయడం వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి శ్రీ లీల నార్మల్గానే చెప్పిన ఈ విషయం మాత్రం నెట్టిజనులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లే అనిపించిందని చెప్పాలి. మొత్తానికి శ్రీ లీల ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్క సినిమాలో నటించిన అనంతరం ఈమె ఏకంగా అరడజనకు పైగా సినిమా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈమె ఇతర సినిమా షూటింగులతో కూడా బిజీగా గడుపుతున్నారు.