అదరగొడుతున్న అల్లు అర్జున్ సరికొత్త లుక్.. బన్నీ అంటే ఈమాత్రం ఉండాలి..!

ఈ కాలం సినిమా స్టార్ లలో ఫ్యాషన్ ఐకాన్ అంటే అల్లు అర్జున్ అని చెప్పాలి..   ఎప్పుడు ఎదో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో సర్వ సాధారణం అయిపొయింది.  అందుకే ఆయనకు స్టైలిష్ స్టార్ అని పేరు. అయన ప్రతి సినిమాలో కొత్త రకం ఫ్యాషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. దాన్ని ఇప్పటి యూత్ ఫాలో అవుతుంటారు.  సినిమా సినిమా కి కొత్త కొత్త ఫ్యాషన్ స్టైల్స్ ని పరిచయం చేస్తూ ట్రెండ్ సృష్టిస్తున్నారు.. సినిమాల్లోనే కాకా బయట కూడా అయన వాడే వస్తువులు ఎంతో లేటెస్ట్ ఫ్యాషన్ తో ఉంటాయి.. దాన్ని తాము కూడా వదలని అభిమానులు ఆశపడుతుంటారు.

రీసెంట్‌గా అల్లు అర్జున్‌ ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో తన సన్నిహితుడు పుట్టినరోజు వేడుకకి బన్నీ హాజరయ్యాడు. ఈ వేడుకలో బన్నీ లుక్‌ బయటకు వచ్చింది.  ఇప్పటి వరకు బయట బన్నీ కనిపించిన లుక్‌కి, ఈ లుక్‌కి పెద్ద తేడా లేదు. రగ్డ్‌గా కనిపిస్తున్న బన్నీ లుక్‌ చాలా కూల్‌గా ఉంది. బన్నీ కూల్‌ చూసిన తన ఫ్యాన్స్‌ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైర్‌ చేస్తున్నారు.

ఇక ఈ పుట్టిన రోజు వేడుకకి అల్లు అర్జున్ పెట్టుకున్న కళ్ళద్దాల పైన అందరు దృష్టి పడింది . ఇవి ఏ కంపెనీ గ్లాస్సెస్ అని ఎంత పెట్టి కొన్నాడని అభిమానులు వెతుకుతూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ధరించిన ఈ చలవ కళ్లద్దాలు ఖరీదు 20 వేలకు పైగానే ఉంటుందట. అంటే ఒక సాధారణ కుటుంబం నాలుగు నెలల పాటు హాయిగా బ్రతికేంత డబ్బు అన్నమాట. ఇదిలా ఉంటే ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శేషాల‌చ‌ల అడ‌వుల్లో మాత్రమే దొరికే ఎర్ర‌చంద‌నం, దానికి సంబంధించిన స్మ‌గ్లింగ్‌పై ‘పుష్ప‌’ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు సుకుమార్ చెప్పాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా టీజర్‌ను బ‌న్నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న విడుద‌ల చేయ‌బోతున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.