Analyst Damu Balaji : అంతరిక్షంలో యుద్ధాలు జరుగుతాయా… చంద్రయాన్ 3 కారణమా…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వైఫల్యాలే గొప్ప పాఠాలు అని మన ఇస్రో శాస్త్రవేత్తలు నిరూపించారు. 2019 లో ప్రయోగించిన చంద్రయాన్ 2 వైఫల్యం తరువాత మళ్ళీ కసిగా పనిచేసి చంద్రయాన్ 3 ను గత నెలలో ప్రయోగించారు. తాజాగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం లో సేఫ్ గా ల్యాండ్ అయి ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూసేలా చేసింది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా కి సాధ్యం కానీ విషయం ను సాధ్యం చేసి అది కూడ అతి తక్కువ ఖర్చుల్లో చేసి చూపింది ఇస్రో. ఆగష్టు 23 న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు జాబిలి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టింది విక్రమ్ ల్యాండర్. ఇక విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞ రోవర్ బయటికి వచ్చి చంద్రుడి ఫోటోలను బెంగళూరు లోని ఇస్రో కార్యాలయం కు పంపుతోంది. ప్రయోగం విజయవంతం అయింది దీంతో భవిష్యత్ లో అంతరిక్ష వ్యాపారం లో భారత్ డామినేట్ చేయబోతుంది అంటూ అక్షరాలా 80 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని కేంద్ర సైన్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేందర్ చెప్పడం రాబోవు కాలంలో భారత్ శాస్త్ర శాంకేతిక రంగంలో ఎలాంటి ప్రభావం చూపనుందో చెబుతున్నాయి. అయితే చంద్రయాన్ వల్ల భవిష్యత్ లో అంతరిక్ష యుద్ధాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

అగ్ర దేశాల నుండి తప్పని ముప్పు… భవిష్యత్ అంత అంతరిక్ష ఆధిపత్యమే….

ఇప్ప్పటికే అగ్ర రాజ్యలైన అమెరికా, చైనా లు తమ వల్ల కానీ పని ఇండియా చేసి చూపినందుకు నిషితంగా గమనిస్తూ ఉన్నాయ్. నిజానికి చంద్రయాన్ 3 వల్ల చంద్రుడిలో ఉన్న వనరులు వంటి విషయాల మీద భారత్ కి పట్టు లభిస్తుంది . ఇది ముఖ్యంగా చైనా వంటి దేశాలకు రుచించదు. దీంతో మన స్పేస్ క్రాఫ్ట్స్ ను ఢీ కొట్టడానికి ఏవైనా ప్రయత్నాలు చేయవచ్చు.

భవిష్యత్ లో ఏదైనా చంద్రుడి మీద ప్రయోగం చేయాలంటే ఇతర దేశాలు భారత్ సహకారం తీసుకుంటాయి. అందువల్ల భారత్ కి వ్యాపారపరంగా ఇది మంచి పరిణామం. అందుకే మనమంటే గిట్టని దేశాలు అంతరీక్షంలో యుద్ధానికీ తెర తీయవచ్చు. ఒకప్పుడు అంటరీక్షం లో ఆధిపత్యం కోసం. అమెరికా, రష్యా పోటీ పడ్డాయి. అయితే ఇపుడు ఉన్న సాంకేతిక తో ఏదైనా దేశ స్పేస్ క్రాఫ్ట్స్ ను హ్యాక్ చేయడమో లెక శత్రు స్పేస్ క్రాఫ్ట్స్ ద్వారా ధ్వంసం చేయడమో చేస్తాయి అంటూ అనలిస్ట్ బాలాజీ తెలిపారు.