Rocking Rakesh: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఈయన జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈయన సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇలా జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందినటువంటి రాకింగ్ రాకేష్ హీరోగా ఒక సినిమాకు కమిట్ అయ్యారు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు ఎంతో ఘనంగా జరిగాయి ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ అలాగే ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
రాకేష్, అనన్య హీరో హీరోయిన్లుగా గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అంజి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో సినిమాలకు డిఓపిగా పనిచేసినటువంటి ఈయన ప్రస్తుతం దర్శకుడుగా మారారు. ఇక ఈ సినిమాకు ఎంపీ సంతోష్ కుమార్ క్లాప్ కొట్టగా.. రోజా కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించి సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందజేశారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ అందరినీ నటించి మెప్పించినటువంటి రాకేష్ హీరోగా అవకాశాలు అందుకున్నారు మరి హీరోగా ఈయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు ఈయనకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…