Rocking Rakesh: హీరోగా జబర్దస్త్ రాకింగ్ రాకేష్.. ఘనంగా పూజా కార్యక్రమాలు పూర్తి!

0
33

Rocking Rakesh: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఈయన జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈయన సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇలా జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందినటువంటి రాకింగ్ రాకేష్ హీరోగా ఒక సినిమాకు కమిట్ అయ్యారు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు ఎంతో ఘనంగా జరిగాయి ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ అలాగే ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

రాకేష్, అనన్య హీరో హీరోయిన్లుగా గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు అంజి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో సినిమాలకు డిఓపిగా పనిచేసినటువంటి ఈయన ప్రస్తుతం దర్శకుడుగా మారారు. ఇక ఈ సినిమాకు ఎంపీ సంతోష్ కుమార్ క్లాప్ కొట్టగా.. రోజా కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

Rocking Rakesh: హీరోగా రాకింగ్ రాకేష్…


ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వ‌హించి సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందజేశారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ అందరినీ నటించి మెప్పించినటువంటి రాకేష్ హీరోగా అవకాశాలు అందుకున్నారు మరి హీరోగా ఈయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు ఈయనకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు.