Analyst Damu balaji : అప్సర కేసులో సాయికృష్ణ కు సహాయం చేసిన మరో వ్యక్తి… ఆ వ్యక్తిని ఎందుకు పోలీసులు విచారించడం లేదు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : సరూర్ నగర్ లో జరిగిన అప్సర హత్య కేసులో రోజుకో కొత్త కథనం వినిపిస్తోంది. ఒకవైపు అప్సర క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ సాయికృష్ణ తండ్రి ఆరోపనలను చేస్తుంటే మరోవైపు సాయి కృష్ణ ఒత్తిడిని తట్టుకోలేక ఆమెను చంపితే మరీ అంత ప్లాన్ ప్రకారం ఎలా మ్యాన్ హోల్ లో పడేసాడు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సాయికృష్ణ హత్య జరిగాక అప్సర శవాన్ని మ్యాన్ హోల్ లో వేయడం, అలాగే అక్కడ దుర్గంధం రాకుండా ఉప్పుబస్తా చల్లడం వంటివి చేసాడు. ఇవన్నీ ఒక్కడే చేయడం కుదరదు. అతనికి ఖచ్చితంగా ఇంకో మనిషి సహాయం కావాల్సిందే అంటూ అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషస్తున్నారు.

సాయికృష్ణ స్నేహితుడి పాత్ర…

సాయికృష్ణ శంషాబాద్ లో హత్య చేసి శవాన్ని సరూర్ నగర్ లో గుడి వెనుక పడేసి ఉప్పు బస్తా తెప్పించి అక్కడంతా చల్లి అలాగే మట్టి అన్నీ వేసి ఎవరికీ దుర్గంధం రాకుండా అనుమానం రాకుండా మేనేజ్ చేసాడు. అయితే ఇవన్నీ ఒకడే చేసానని చెబుతున్నా అతనికి ఖచ్చితంగా మరో మనిషి సహాయం చేసి ఉంటాడని తెలుస్తోంది. మొదట్లో అతనికి సునీల్ అనే స్నేహితుడు హెల్ప్ చేసాడని కథనాలు వినిపించినా కొద్ది రోజులకు అతని పేరు కేసులో వినిపించలేదు.

పోలీసులు సరైన విచారణ జరపడం లేదు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. అప్సర కుటుంబం బలహీన కుటుంబం కావడం, అప్సర గతం గురించి బయటికి రావడంతో అప్సర తల్లి, తండ్రి మీడియా ముందు మాట్లాడటానికి భయపడుతున్నారు. వాళ్ళు గట్టిగా మాట్లాడగలిగితే కేసులో పోలీసులు కొంత అప్సర కు న్యాయం చేస్తారు. అయితే సాయికృష్ణ తండ్రి మాత్రం మీడియాతో మాట్లాడుతూ మీడియా తప్పుగా రాస్తే వాళ్ళ మీదే కేసులు వేస్తామంటూ బెదిరిస్తున్నాడు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.