CPI Narayana : 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ సీఎం… బీజేపీతో కలిసి పనిచేయాల్సి వస్తే మాత్రం చచ్చిపోయినట్లే..: సిపిఐ నేత నారాయణ

CPI Narayana : రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఏ పార్టీ లో చేరుతారో తెలియదు, ఏ పార్టీ మరో పార్టీ తో పొత్తు పెట్టుకుంటుందో తెలియదు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. రాబోయే ఎన్నికలలో విజయం కోసమే అన్నట్లుగా అన్ని పార్టీలు ఎవరికి వారు వ్యూహ రచనకు పదును పెడుతూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో అయితే బీజేపీ ప్రాపకం కోసం అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం రెండూ పాకులాడుతున్నాయి. ఎవరు గెలిచినా బీజేపీకి ఢోకా లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోందో అనే విషయాలను సిపిఐ సీనియర్ నేత నారాయణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

పవన్ సీఎం అయితే…

సిపిఐ నారాయణ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యణ్ తో పొత్తు గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ఈ ఎన్నికలలో పవన్ కళ్యణ్ సీఎం కాలేడని అందుకు అనుకూల పరిస్థితులు ఆయనకు లేవని తెలిపారు. ఆ విషయం ఆయనకే తెలుసు అందుకే ఒక ముప్పై సీట్లైనా వస్తే అన్నట్లుగా ఉన్నారని తెలిపారు. ఇక టీడీపీ, జనసేన పొత్తు గురించి మాట్లాడుతూ వాళ్లిద్దరూ జతకడితే బాగుంటుందని బీజేపీ ని కలుపుకోక పోతే మేము వాళ్ళతో కలిసి నడుస్తామని చెప్పారు. జనసేన టీపీడీ బీపీజీ కలిస్తే జగన్ కి మరోసారి గెలుపు నల్లేరు మీద నడకే అంటూ చెప్పారు.

వీరిద్దరికీ పడే మైనారిటీ బీసీ ఓట్లు జగన్ కు పడుతాయన్ని చెప్పారు. అందుకే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే బాగుంటుంది కానీ బీజేపీ ని కలుపుకోక పోతేనే మంచిదని చెప్పారు. ఇక ఒకవేళ బీజేపీతో ఆ రెండు పార్టీలు కలిస్తే వామపక్షాలు ఆ కూటమికి దూరంగా ఉంటాయని చెప్పారు. టీడీపీ, జనసేన ఒకవేళ పొత్తు కోసం వామపక్షాలను అడిగినా బీజేపీ లేకుంటే వస్తామని కండిషన్ పెడతామని అలా కాకుండా బీజేపీ ఉన్నా జగన్ ను ఓడించడం కోసం చేతులు కలిపమంటే అది వామపక్షాలు చచ్చిపోయినట్లే, బీజేపీ తో కలిసి పనిచేయాల్సి వస్తే అంతకన్నా ఆత్మహత్య చేసుకోవడం మంచిది అని భావిస్తాం అంటూ చెప్పారు. బీజేపీ అసలు మానవత్వ పార్టీనే కాదని కులతత్వాన్ని రెచ్చగొడుతుందని చెప్పారు. చంద్రబాబు సరైన సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటారని చెబుతూ కేంద్రంతో సఖ్యతగా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ బీజేపీ తో చేతులు కలిపితే రాష్ట్రానికి అన్యాయం చేసినవాడవుతాడు. అదే బీజేపీ కి దూరంగా ఉంటే ఏపీ లో అధికారం వస్తుంది ఏపీ ప్రజలను కాపాడినవాడు అవుతాడు అంటూ నారాయణ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago