Analyst Damu Balaji : అమిత్ షా ని కలిసిన చంద్రబాబు… మారనున్న ఏపీ రాజకీయం… బీజేపీ గాలి ఎటు వైపు…: అనలిస్ట్ దాముబాలాజీ

Analyst Damu Balaji : ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లే వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు పొత్తు కోసం కొన్ని పార్టీలు తహతహ లాడుతుంటే మరోవైపు కేంద్ర పెద్దలతో మంథనాలు చేస్తూ హస్తిన బాట పడుతున్నారు. బీజేపీ రథ సారథి అమిత్ షా తో మీటింగులకు వెళ్తూ చర్చలు చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో బయటికి పొక్కకపోయినా మీడియా మాత్రం బోలెడు కథనాలను వండి వారుస్తోంది. తాజాగా టీడీపీ బాస్ చంద్రబాబు నాయుడు అమిత్ షా ని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

కమలం ఎటు…

టీడీపీ చాలా రోజులుగా బీజేపీ తో దోస్తీ కట్టుకుంటోంది. అయితే బీజేపీ మాత్రం తమ కొత్త నేస్తం జగన్ తోనే ఉంటానంటోంది. జగన్ మీద ఉన్న కేసులు మూలాన జగన్ తాము చెప్పినట్లు వింటాడనే నమ్మకం ఉండటం వల్ల ఢిల్లీ పెద్దలు ఏపీలో జగన్ వెంటనే ఉండాలని అనుకుంటున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. తెలంగాణలో ఈసారి బీజేపీ ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది. అందుకు టీడీపీ అవసరం ఉంది. టీడీపీ కి తెలంగాణలో లీడర్లు లేకపోయినా క్యాడర్ ఉంది.

ఆ క్యాడర్ ను కమలం వైపుకు తిప్పగలిగితే ఓటు బ్యాంకు పెరిగి కెసిఆర్ కి ధీటుగా బీజేపీ తయారవుతుంది. అయితే తెలంగాణలో టీడీపి కావాలంటే ఏపీ లో జగన్ దోస్తానా విడిచి పెట్టాలని చంద్రన్న కోరుకుంటున్నాడు. అయితే బీజేపీ ఏం ఆలోచిస్తోందో ఇప్పటికైతే బయటకు రావడం లేదు కానీ ప్రస్తుతం సీబీఎన్ అమిత్ షాని కలవడం గురించి రకరకాలుగా మాటాడుతున్నారని బాలాజీ అభిప్రాయపడ్డారు. కొందరు వివేకానంద రెడ్డి కేసు విషయమే అంటూ మాట్లాడుతుంటే మరికొందరు రామోజీ రావు మీద కేసులు విషయమై అమిత్ షా వద్దకు వెళ్లాడని అంటున్నారంటూ బాలాజీ తెలిపారు.