Analyst Damu Balaji : మార్గదర్శి లో బ్లాక్ మనీ… కోర్ట్ లో షాకింగ్ నిజాలు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఈనాడు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఓనర్ అయిన రామోజీ రావు గారి మీద సిఐడి విచారణ జరగడం ఒక్కసారిగా చర్చకు దారితీసింది. సుమారు ఐదు గంటల పాటు ఆయనకు ప్రశ్నలు వేసింది సిఐడి. అయితే ఆయన విచారణలో పెద్దగా సమాధానాలు చెప్పలేదని బయటికి వినిపించింది. అయితే సిఐడి విచారణకు హాజరవుతున్నారు అనే సమయానికి అనారోగ్య కారణాలతో మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ ఇంట్లో ఆయన పడుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి రామోజీ రావు గారికి ఆయన కోడలు శైలజ కిరణ్ గారికి సీఐడి నోటీసులు పంపించడం జరిగింది. అయితే తాజాగా బ్లాక్ మనీ అంశం తెర మీదకు రావడంతో ఈ ఇష్యూ చర్చకు దారితీసిందని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

మార్గదర్శిలో బ్లాక్ మనీ…

ఏపీ ప్రభుత్వ సిఐడి మార్గదర్శి సీఈఓ రామోజీ రావు అలాగే మేనేజంగ్ డైరెక్టర్ శైలజ మీద ఏపీ ప్రొటెక్షన్ అఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 మరియు చిట్ ఫండ్స్ చట్టం 1982 రెండు సెక్షన్స్ కింద 76, 79 అలాగే ఐపీసీ సెక్షన్స్ 120(B), (క్రిమినల్ కన్స్పిరేసీ), 409 (క్రిమినల్ బ్రీచ్ అఫ్ ట్రస్ట్), 420 (చీటింగ్) అండ్ 477(A) 34 (ఫాల్సిఫికేషన్ అఫ్ అకౌంట్స్) కేసులు నమోదు చేసింది. అయితే తాజాగా విచారణలో సిఐడి అధికారులు మార్గదర్శి లో ఖాతాదారులు బ్లాక్ మానీ పెడుతున్నారని అందుకే ఆ సంస్థ మీద ఫిర్యాధులు లేవని చెబుతున్నారంటూ బాలాజీ అభిప్రాయాపడ్డారు.

ఆర్బీఐ నిభంధనలు అలాగే సెంట్రల్ పన్నుల శాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ మార్గదర్శిలో డబ్బులను డిపాసిట్ చేయించుకున్నారనే ఆరోపణలను అధికారులు చేస్తున్నారు. ఇక కోర్ట్ కూడా మార్గదర్శి నుండి ఖాతాదరుల ఇన్ఫర్మేషన్ అలాగే ఎంత డిపాజిట్స్ ఉన్నాయి వంటి అంశాలను తెలపాలని మార్గదర్శి సంస్థను అదేశించింది. బ్యాంకులలో 7 % వరకు వడ్డీ రేట్లు ఉండగా మార్గదర్శి లో మాత్రం 4,5 కి వడ్డీ రేట్లు మారకపోయినా అక్కడే ఎందుకు డిపాజిట్ చేస్తున్నారనేది సీఐడి ప్రశ్న. నల్లధనం దాచుకోడానికి చాలా మందికి మార్గదర్శి అవకాశం ఇస్తోందని సిఐడి అధికారులు చెప్తున్నారంటూ బాలాజీ తెలిపారు.