Analyst Damu Balaji : రష్యా లూనా 25 ఫెయిల్ అవడం తో చంద్రయాన్ 3 మీద పెరిగిన టెన్షన్… రేపే జాబిల్లి మీదకు ల్యాండింగ్…!

Analyst Damu Balaji : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదవడానికి సిద్ధమైంది. చంద్రుడిపై పరిశోధనలు జరిపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్ -3 ప్రయోగం జులై 14 జరుపగా విజయవంతంగా భూకక్ష్యలోకి చంద్రయన్ 3 చేరింది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్ – 3 రాకెట్ చంద్రయాన్ – 3 ని మోసుకెళ్లింది. జూలై 14 మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బయల్దేరింది. ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్‌-3 యాత్రలో భాగంగా ఈ రాకెట్‌ జాబిల్లి వద్దకు ప్రయాణం ప్రారంభించి రేపు జాబిల్లి దక్షిణ ధ్రువంపు కక్ష్యలో ల్యాండ్ కాబోతోంది. ఇప్పటివరకు సక్సెస్ అయినా చంద్రయాన్ 3 రేపు కూడ సాఫ్ట్ లాండ్ అయి భారత్ కు అరుదైన గౌరవం తీసుకురావాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తుండగా తాజాగా రష్యా ప్రయోగించిన లూనా 25 జాబిల్లి మీదకు చేరకుండానే క్రాష్ ల్యాండ్ అవడంతో ఒక వైపు మనలోనూ టెన్షన్ మొదలయింది అంటూ దాము బాలాజీ చంద్రయాన్ 3 గురించి మాట్లాడారు.

చంద్రయాన్ మీద ఆత్మవిశ్వాసం తో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు… రేపు లైవ్…

గతంలో ప్రయోగించిన చంద్రయాన్ 2 కూడ నేటి రష్యా లూనా 25 లాగ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. దీనికి కారణాలను బాలాజీ గారు వివరించారు. నిజానికి గతంలో ఇస్రో ప్రయోగించినపుడు సక్సెస్ మోడల్ మీద బేస్ అయి ప్రయోగం చేసారు. కానీ నిజానికి సక్సెస్ ఎలా చేయాలనీ అలోచించి పంపినప్పుడు అక్కడి పరిస్థితుల వల్ల ప్రయోగం ఫెయిల్ అయింది. ఇపుడు లూనా 25 కూడ అలానే రష్యా శాస్త్రవేత్తలు పంపారు. కానీ ఈసారి మనవాళ్ళు అనుభవం తో ఫెయిల్యూర్ మోడల్ బేస్ మీద పంపారు.

అనగా ఎలాంటి సందర్భంలో ఫెయిల్ అవ్వొచ్చు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు వంటి విషయాలను ముందే అంచనా వేసి దానికి అనుగుణంగా ప్రయోగం చెప్పట్టడం చేసారు. ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు వెళ్లిన చంద్రయన్ 3 రేపు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చంధ్రుడి దక్షిణ ధ్రువం వైపు ల్యాండ్ అవ్వనుంది . ఇప్పటివరకు తక్కువ ఇదనం ఖర్చు చేసుకోవడం వల్ల చంద్రయాన్ మరిన్ని ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించగలదని ఈసారి సక్సెస్ అవుతుందని ఇస్రో శాస్త్రవెత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారని బాలాజీ తెలిపారు. ఇక లూనా 25 ఫెయిల్ అయినా చాలా తక్కువ సమయంలోనే చంద్రయాన్ కంటే ముందే చంద్రుడి దక్షిణ ధ్రువనికి చేరుకొని సక్సెస్ అయినట్లే అంటూ తెలిపారు. ఇక ఈ ప్రయోగం సక్సెస్ అయితే చంధ్రుడి ఉపరితలం మీద గడ్డకట్టిన ఐస్ ఉందొ లేదో తెలుస్తుందని ఒకవేళ వుంటే అక్కడ జీవించడానికి ఎలాంటి అవకాశం ఉందొ కనుక్కోవచ్చంటూ బాలాజీ తెలిపారు.