Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నటువంటి మహేష్ బాబు గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మహేష్ బాబు సినిమాల పరంగా మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.మహేష్ బాబు ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే ఈయన సినిమాలపరంగా ఇప్పటివరకు భక్తి పాత్రలలో నటించలేదని చెప్పాలి.నాగార్జున మాదిరిగా ఈయనకు కూడా ఇలాంటి భక్తి పాత్రలలో నటించాలని కోరిక ఉందట అయితే ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా అలాంటి కథతో మహేష్ బాబు వద్దకు వెళ్లలేదని అందుకే మహేష్ బాబుకి ఆ కోరిక ఇప్పటివరకు నెరవేరకుండా ఉందని తెలుస్తుంది.ఇలా మహేష్ బాబుకి భక్తి పాత్రలలో నటించాలని ఉందనే విషయం తెలియడంతో అభిమానులు ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.
ఇక మహేష్ బాబు చేసినటువంటి ఈ కామెంట్లపై కొందరు స్పందిస్తూ ఇప్పటివరకు సినిమాలు పరంగా మహేష్ బాబు కోరికను తీర్చే డైరెక్టర్స్ ఇండస్ట్రీలో లేరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి మహేష్ బాబు తన మనసులో కోరికను బయటపెట్టిన తర్వాత అయినా అందుకు తగ్గట్టుగా ఎవరైనా కథను సిద్ధం చేస్తారా లేదా అన్నది తెలియాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…