Samantha: సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించి దేశ విదేశాలు తిరుగుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. సమంత తాజాగా న్యూయార్క్ వీధులలో చక్కర్లు కొడుతూ అక్కడ అందాలను ఆస్వాదిస్తూ పెద్ద ఎత్తున ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సమంత గత కొంతకాలంగా మాయోసైటిస్ వ్యాధి బారిన పడటంతో ఈ వ్యాధి నుంచి బయటపడటానికి ఈమె సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం సమంత అమెరికా వెళ్ళబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం తన తల్లితో పాటు అమెరికాలో ఉన్నటువంటి సమంతకి త్వరలోనే ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.
ఇలా అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం కొన్ని నెలల పాటు సమంత ఇక్కడే ఉండబోతున్నారని సమాచారం అందుకే ఇక్కడ హాస్పిటల్స్ లో ఉండాలి అన్న లేదా రెస్టారెంట్లో ఉండాలి అన్న చాలా ఖర్చు అవుతుంది అలాగే ఇబ్బంది అవుతుందని భావించినటువంటి సమంత ఏకంగా అమెరికాలో ఒక ఇల్లు కొనుగోలు చేశారట.అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఒక చిన్న ఇంటిని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈమె కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఇలా సమంత ట్రీట్మెంట్ పూర్తి అయ్యేవరకు ఈమె ఇక్కడే ఉండబోతున్నారని ట్రీట్మెంట్ పూర్తి అయ్యి తిరిగి ఇండియా వచ్చే సమయంలో ఆ ఇంటిని అమ్మేయాలనే ఉద్దేశంతోనే సమంత అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఒక చిన్న ఇల్లుని కొనుగోలు చేశారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి సమంత నిజంగానే అమెరికాలో ఇల్లు కొనిందా లేదా అన్న విషయాలు తెలియాలి అంటే సమంత ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…