Analysts Damu Balaji & Dasari Vignan : నవీన్ హత్య కేసులో నిహారిక జైలు నుండి విడుదల అయ్యాక ఆ సంఘం వాళ్ళు ఏం చేసారంటే…: అనలిస్ట్స్ దాము బాలాజీ & దాసరి విజ్ఞాన్

Analysts Damu Balaji & Dasari Vignan : నవీన్ అనే బిటెక్ విద్యార్థిని అత్యంత దారుణంగా అతని స్నేహితుడు హరిహర కృష్ణ చంపడం, అది కూడా తన ప్రియురాలు నిహారిక కోసం చంపడం, ఏదో క్షణికవేశంలో చేసాడు అనేలా కాకుండా మూడు నెలల ముందు నుండే ప్లాన్ వేసి పక్కాగా చంపాడు హరిహర కృష్ణ. ఈ కేసులో ఇంతవరకు నిహారిక గురించి విషయలు బయటికి రాలేదు. హరిహర హత్య చేస్తున్నట్లు తనకు తెలియదంటూ చెప్పిన నిహారిక అరెస్టు తరువాత మొదటి సారి పోలీసుల ఎదుట నోరు తెరిచింది. నవీన్ తో పరిచయం దగ్గరి నుండి నవీన్ హత్య తరువాత జరిగిన సంఘటనల వరకు అన్నింటినీ చెప్పింది. ఆర్య 2 సినిమాకు ఏ మాత్రం తీసిపోని క్రైమ్ లవ్ స్టోరీలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అయితే నిహారికకు ఆ శిక్ష పడాలి ఈ శిక్ష పడాలి అంటూ చాలా మంది కోరుకున్నా చివరకు నిహారిక బెయిల్ మీద అపుడే బయటికి వచ్చేసింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్స్ దాము బాలాజీ మరియు దాసరి విజ్ఞాన్ తమ అభిప్రాయాలను తెలిపారు.

నిహారిక బయటికి వచ్చాక అమెకు రక్షణ లేదు…

నవీనే హత్య కేసులో హత్య చేసింది హరిహర కృష్ణ అయినా పబ్లిక్ మాత్రం నిహారిక మీద చాలా కోపంగా ఉన్నారు. మొదటి నుండి ఇందులో కీలకంగా ఉన్న నిహారిక విషయంలో మీడియా, పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. మొదట్లో నిహారిక ఫోటో కూడా చూపించకపోవడంతో ఆమెను చూపించాలని బాగా డిమాండ్ చేసారు. ఇక ఇప్పుడు బెయిల్ మీద బయటికి రావడంతో బక్కగా మొహానికి స్కార్ఫ్ కట్టుకున్న ఎవరైనా అమ్మాయి కనిపిస్తే మొహం చూపించమని అడుగుతున్నారు. నిహారికను మాకు అప్పగిస్తే మేమే ఆమెకు తగిన శిక్ష విధిస్తామంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెట్టడం గురించి అనలిస్ట్స్ దాము బాలాజీ అలాగే దాసరి విజ్ఞాన్ మాట్లాడారు.

హరిహర మీద కన్నా నిహారిక మీదే ఎక్కువ కోపం ఉందని, హత్య చేయాలని అనుకుంటున్నట్లు హరిహర చెప్పినా కూడా నిహారిక లైట్ తీసుకోవడం, హత్య జరిగాక కూడా చాలా నింపాధిగా ఉండటం ఇవన్నీ జనాలకు నచ్చలేదని పైగా ఈ కేసులో తనని తప్పించడానికి చూడటంతో మరింత కోపం తెచ్చుకుంటున్నారంటూ అభిప్రాయపడ్డారు. ఇక నిహారికను జైలులో తోటి మహిళా ఖైదీలు కూడా కొట్టారనే వార్తలు వినిపించాయి. అందులో నిజాలెంతో తెలియకపోయినా నిహారికాకు బయట రక్షణ లేదనేది వాస్తవం అంటూ అభిప్రాయపడ్డారు.