Featured

Prem Rakshith: అవార్డు ప్రకటన రాగానే బాత్రూంలోకి వెళ్లి బోరున ఏడ్చాను… ప్రేమ్ రక్షిత్ కామెంట్స్ వైరల్!

Prem Rakshith: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలోని నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి ఆదరణ రావడమే కాకుండా ఈ సినిమాకు పని చేసినటువంటి వారికి కూడా ఎంతో మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పటివరకు ప్రేమ రక్షిత్ అంటే ఎవరో కూడా తెలియని వారికి కూడా ఈయన బాగా సుపరిచితమయ్యారు.

ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ప్రతి ఒక్కరు ఈయన కొరియోగ్రఫీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆస్కార్ అందుకున్న తర్వాత మొదటిసారి ఈయన ఒక మీడియా ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయనకు రాజమౌళి గారితో పరిచయం తనకు సినిమా అవకాశాలు రావడం గురించి కూడా తెలిపారు.

తాను ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నప్పటికీ ఆ విషయాన్ని దాచి తాను రాజమౌళి కుమారులకు డాన్స్ నేర్పించడం కోసం ట్యూషన్ మాస్టర్ వారి ఇంటికి వెళ్లే వాడినని తెలిపారు. అయితే తను సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేస్తున్నానని తెలుసుకున్నటువంటి రాజమౌళి గారు తనకు తన ప్రతి ఒక్క సినిమాలో అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ఇలా రాజమౌళి గారితో తన ప్రయాణం సై సినిమా నుంచి మొదలైందని తెలిపారు.

Prem Rakshith: మళ్లీ జన్మంటూ ఉంటే ఇలాగే పుట్టాలి…

ఈ విధంగా రాజమౌళి గారి ప్రతి సినిమాలో తాను బాగం అయ్యానని తెలిపారు. ఇక నాటు నాటు పాట కోసం భారీగా కష్టపడ్డామని ఈయన ఈ పాట వెనుక ఉన్న కష్టం గురించి చెబుతూ మా కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని తెలిపారు. ఇక ఈ పాట ఈ స్థాయిలో ఆదరణ సంపాదించుకుంటుందని తాను అస్సలు ఊహించలేదని ప్రేమ్ రక్షిత్ వెల్లడించారు. ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందని ఫోన్ రాగానే ఒకసారిగా ఎమోషనల్ అవుతూ బాత్రూంలోకి వెళ్లి గట్టిగా గుక్క పట్టి ఏడ్చానని తెలిపారు.ఇలా గోల్డెన్ గ్లోబ్ అవార్డు స్థాయికి ఈ పాట వెళ్తుందని నేను ఊహించలేదు. అలాంటి ఈ పాట ఆస్కార్ గెలుచుకోవడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అంటూ మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలా ప్రేమ్ రక్షిత్ గానే పుట్టాలని ఈయన కోరుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago