Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..?

Anchor Rashmi: నేను హిందూ అయినా ఎప్పటికీ ఆ పని చేయను… యాంకర్ రష్మీ కామెంట్స్ వైరల్!

Anchor Rashmi: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రశ్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ వెండితెర ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంటుంది. ఇలా యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన రష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..?

స్వతహాగా జంతు ప్రేమికురాలు అయినా రష్మి, మూగజీవాల సంరక్షణ కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మూగజీవాలను సంరక్షించమని అందరినీ వేడుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా రోడ్లమీద ఆహారం లేకుండా ఉండే మూగజీవాలకు ఆహారం అందిస్తూ ఉంటుంది. ఇలా తరచూ జంతువుల పట్ల తన ప్రేమను చూపించే రష్మీ తాజాగా సోషల్ మీడియా ద్వారా మరొక పోస్ట్ షేర్ చేసింది.

ఆ పోస్ట్ కి ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ కి రష్మి సరైన సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల బుల్ ఫైట్ కి సంబంధించిన ట్వీట్ కి రష్మి రిప్లై ఇస్తూ.. ‘ఇలాంటి క్రీడలను ఎంజాయ్ చేస్తూ రాత్రి పూట ఎలా నిద్రపోతారు’ అని రష్మీ ట్వీట్ చేసింది. దీంతో ఒక నెటిజన్.. ‘సినీ పరిశ్రమలో ఉన్న మీరు లెదర్ ఉత్పత్తులను ఎలా వాడతారు? ముందు మీరు వాటిని నిషేధించండి. ఆ తర్వాత ప్రతీది నిషేధించబడుతుంది’ అంటూ కామెంట్ చేశాడు.

Anchor Rashmi: ఎప్పటికీ లెదర్ వస్తువులు వాడను…

నెటిజన్ చేసిన కామెంట్ కి రష్మి స్పందిస్తూ..” నేను సినీ పరిశ్రమ నుంచే వచ్చాను. నేను లెదర్ ఉత్పత్తులు వాడను. ఎక్కడైనా జంతువుల తోలుతో చేసిన ఉత్పత్తులను కొని, వాడకండి. ఎందుకంటే మన దేశంలో లెదర్ అనేది ఎక్కువగా వయోజన ఆవుల నుంచి కూడా వస్తుంది. హిందువునైన నేను అలాంటి క్రూరమైన పని ఎప్పటికీ చేయను అంటూ సరైన సమాధానం ఇచ్చింది. దేశంలో ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువులను బ్యాన్ చేయలేరు. ఇదంతా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. నిషేధించడం, దాన్ని మరింత హైలైట్ చేయడం కంటే లెదర్ ని కొనుగోలు చేయకుండా ఉండడమే మంచిదంటూ రష్మీ ట్వీట్ చేసింది.