Suma Kanakala: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో యాంకర్ సుమా కనకాల ఒకరు.కథ కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సుమ నిత్యం సినిమా ఈవెంట్లు, సక్సెస్ మీట్ అంటూ నిత్యం ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా వరుస ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్న సుమ మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి అభిమానులను సందడి చేస్తున్నారు. ఇటీవల సుమ మద్రాస్ ఐఐటీ కాలేజీకి వెళ్ళింది. అక్కడ స్టూడెంట్స్ అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కు సుమ ఫన్నీగా సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమ తాను యాంకర్ కావడం వెనుక ఉన్న విషయాలను తెలియచేశారు.
సుమ సంపాదించిన దాంట్లో ఎంతో కొంత కొందరికే సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే తాను 30 మంది పిల్లలను దత్తత తీసుకొని పూర్తిగా వారి చదువు బాధ్యతలను తానే చూసుకుంటున్నానని తెలియజేశారు.వాళ్ళు బాగా సెటిల్ అయ్యే వరకు నేను వాళ్ళతోనే ఉంటాను. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఎఫ్ ఐ ఏ సంస్థ వాళ్ళు మాతో కొలాబరేట్ అయ్యారని సుమ వెల్లడించారు.
ఇలా సుమ ఏకంగా 30 మంది విద్యార్థులను దత్తత తీసుకున్నారనీ తెలియడంతో ఎంతోమంది సుమపై ప్రశంసలు కురిపిస్తూ సుమది ఎంతో మంచి మనసు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సుమా ప్రస్తుతం బుల్లితెరపై సుమ అడ్డా అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే సినిమా ఈవెంట్లతో ఈమె బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…