Anchor Rashmi: నువ్వు లేకపోయినా నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి… ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మి!

Anchor Rashmi: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ గుర్తింపు పొందిన రష్మి గౌతమ్ ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా నటించే అవకాశం అందుకుంది. జబర్దస్త్ లో యాంకర్ గా మారిన తర్వాత రష్మీ మంచి గుర్తింపు పొందింది. అంతే కాకుండా ఈటీవీలో ప్రసారం అవుతున్న అనేక టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పండుగ సందర్భాలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో కూడా రష్మీ సందడి చేస్తూ ఉంటుంది.

జబర్దస్త్ యాంకర్ గా కొంతవరకు గుర్తింపు పొందిన రష్మి సుధీర్ ప్రేయసిగా బాగా పాపులర్ అయింది. షో రేటింగ్స్ కోసం మల్లెమాల వారు క్రియేట్ చేసిన లవ్ ట్రాక్ వల్ల సుధీర్ రష్మీ జంటగా బాగా పాపులర్ అయ్యారు. ఇలా ఒకవైపు టీవీ షో లలో సందడి చేస్తూనే మరొకవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది. గతంలో రష్మీ నటించిన గుంటూరు టాకీస్ సినిమా హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఇటీవల రష్మీ హీరోయిన్ గా నటించిన మరొక సినిమా కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రష్మీకి సినిమాలలో అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. తాజాగా శుక్రవారం రోజున రష్మి గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా మరణించిన సంగతి రష్మీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన గ్రాండ్ మదర్ మరణ వార్త తెలియజేస్తూ రష్మి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

Anchor Rashmi: నీ ప్రభావం మాపై చాలా ఉంది..


“బరువెక్కిన గుండెలతో కుటుంబమంతా ఆమెకి ఆఖరి సారిగా వీడ్కోలు పలికాము. నువ్వు చాలా స్ట్రాంగ్. నీ ప్రభావం మాపై చాలా ఉంది. ప్రస్తుతం నువ్వు మాతో లేకపోయినా కూడా నీ జ్ఞాపకాలు చిరకాలం మాతోనే ఉంటాయి” అంటూ తన గ్రాండ్ మదర్ ని తలచుకొని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ బి స్ట్రాంగ్ రష్మీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.