Shyamala: పవన్ కళ్యాణ్ లో ఆయాసం ఆవేశమే చూసాము… సాయం చేయడం చూడలేదు: శ్యామల

Shyamala: ఏపీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటలలో తెలియనున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఫలితాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా ఎన్నికల ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికల ఫలితాలు మొత్తం ఒకవైపు అయితే పిఠాపురం ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు అనేలాగా సాగుతున్నాయి.

ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత అనేలా మొదటి నుంచి కూడా పోటాపోటీ కొనసాగుతూ ఉంది అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం పవన్ కి అనుకూలంగా రాబోతున్నాయని పలు సర్వేలు వెల్లడించారు. ఇకపోతే వంగా గీత తరపున కూడా భారీ స్థాయిలో అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా యాంకర్ శ్యామల సైతం గంగా గీత గెలుపు గురించి పలు సందర్భాలలో మాట్లాడారు.

ఇకపోతే తాజాగా యాంకర్ శ్యామల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ  ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఈమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక రాజకీయ నాయకుడు అంటే ఆలోచన సాయం చేసే గుణం ఉండాలి తప్ప ఆవేశం పనికిరాదని తెలిపారు..

సహాయం చేయలేదు…
ఇప్పటివరకు నేను పవన్ కళ్యాణ్ లో ఆవేశం చూశాను అరవడం చూసాను ఆయాస పడటం చూసాను తప్ప ఎక్కడ సహాయం చేయటం చూడలేదని ఈమె తెలిపారు. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పిన ఎగ్జాక్ట్ పోల్స్ లో మాత్రం వంగ గీతనే గెలుస్తారని ఈమె చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలా ఈ వీడియో వైరల్ గా మారడంతో పవన్ ఫ్యాన్స్ దారుణమైన కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు జూన్ 4 తర్వాత మీ బతుకు ఏంటో ఊహించుకో అంటూ మరి వార్నింగులు ఇస్తున్నారు.