Anil Kumble: దవడ విరిగిన ఆగని పోరాటం… తలకు కట్టుకట్టుకుని మైదానంలో అడుగుపెట్టిన కుంబ్లే!

Anil Kumble: క్రికెటర్స్ అంటేనే మనకు ఎక్కువగా సిక్స్లు ఫోర్లు కొట్టే బ్యాట్ మెన్స్ మాత్రమే గుర్తుకు వస్తారు కానీ బౌల్లర్స్ గుర్తురారు. ఒక నికాసైన ఆటగాడిని పడగొట్టాలంటే బౌలర్ ఎంతో కీలకం. ఇలా ఒక మ్యాచ్ విజయవంతం కావడానికి బ్యాట్మెంట్స్ ఎంత కీలకంగా ఉంటారో బౌలర్స్ కూడా అంతే కీలకంగా ఉంటారని చెప్పాలి.

ఇలా బౌలింగ్లో ఎంతో నైపుణ్యం కలిగి ఎలాంటి బ్యాట్ మెన్స్ నైనా తన బౌలింగ్ తో భయపెట్టే వారిలో అనిల్ కుంబ్లే ఒకరు. ఇలా అనిల్ కుంబ్లే తన కెరియర్లో చేసినటువంటి ఒక త్యాగం పూర్తిగా కనుమరుగైపోయింది. ఇంతకీ ఈయన ఏం చేశారు అనే విషయానికి వస్తే. 2002, ఐదు టెస్టుల సిరీస్‌ కోసం సౌరవ్‌ గంగూలీ సారథ్యంలో భారత జట్టు వెస్టిండీస్‌ లో పర్యటించింది.

ఈ విధంగా తొలి మూడు టెస్టులో పూర్తి అయ్యాయి నాలుగో టెస్ట్ కోసం సెయింట్‌ జాన్స్‌ (ఆంటిగ్వా) వేదికగా నాలుగో టెస్టు జరిగింది. అనిల్‌ కుంబ్లే బ్యాటింగ్‌కు వచ్చాడు. మరో ఎండ్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఉన్నాడు. అప్పటికే.. విండీస్‌ పేసర్‌ మెర్విన్‌ డిల్లాన్‌ రాకాసి బౌన్సర్లతో మంచి కసితో ఉన్నారు. అనిల్ కుంలే బ్యాటింగ్కు రాగానే ఆయన తన బౌలింగ్ తో షార్ట్‌ పిచ్‌ బంతి కుంబ్లే దవడను బలంగా తాకింది. ఆ దెబ్బకు అతని ముఖం ఒక్కసారిగా ఆకారం మారిపోయి రక్తం కారసాగింది.

Anil Kumble: తలకు కట్టుతోనే మైదానంలో దిగిన కుంబ్లే…

గ్రౌండ్ లోకి వచ్చిన ఫిజియో అతడిని పరిశీలించి మైదానం వదిలి వెళ్లాలని చెప్పిన వినకుండా అలాగే బ్యాటింగ్ కొనసాగించారు. చివరికి డిల్లాన్‌ బౌలింగ్ లోనే క్యాచ్ అవుట్ అయ్యారు.మ్యాచ్ అనంతరం ఆయనకు ఎక్సరే తీయగా సర్జరీ చేయాలని చెప్పినప్పటికీ వినకుండా తదుపరి మ్యాచ్ ఆడటం కోసం ఆసక్తి చూపించారు. మ్యాచ్లో ఎలాగైనా గెలవాలంటే వికెట్లు పడగొట్టాలన్న కసి ఆయనలో కనిపించింది. ఇక భారత టీం ఈయనకు విశ్రాంతి తీసుకోమని చెప్పిన వినకుండా తలకు కట్టుతోనే ఆయన మైదానంలోకి వచ్చి బౌలింగ్ చేశారు. ఇలా తలకు కట్టుతో నొప్పితోనే బ్రియాన్‌ లారా వికెట్‌ పడగొట్టాడు. ఆ సమయంలో ఈయన ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. మరో ఎండ్ నుంచి సహకారం లేకపోవడంతో.. వెస్టిండీస్ బ్యాటర్స్ క్రీజ్ లో పాతుకుపోయారు.