Annamayya : అన్నమయ్యకు మీసం.. పైగా ఆయన తన భార్యలతో సరస గీతాలు.. హవ్వా.!! ఇదెక్కడి చోద్యం.. అనే విమర్శలు చెరిపేస్తూ..!!

సాంఘిక చిత్రాలు ఎన్నో వచ్చిన పౌరాణిక చిత్రానికి ఉండే ప్రాధాన్యత వేరే విధంగా ఉంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ సినిమాతో దాదాపుగా అన్ని చిత్రాలని రూపొందించారని చెప్పవచ్చు. సింహబలుడు లాంటి జానపద చిత్రం, అన్నమయ్య తో పౌరాణిక చిత్రాన్ని రూపొందించిన ఘనత ఆయనకు దక్కింది.

Annamayya : అన్నమయ్యకు మీసం.. పైగా ఆయన తన భార్యలతో సరస గీతాలు.. హవ్వా.!! ఇదెక్కడి చోద్యం.. అనే విమర్శలు చెరిపేస్తూ..!!

అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నాగార్జునకు అంత పేరు రావడానికి ఈ సినిమానే ప్రధాన కారణమని చెప్పవచ్చు.యాక్షన్, ప్రేమ కథలకి ఆయన పరిమితమని విమర్శలను చెరిపేస్తూ నాగర్జున ఈ సినిమాలో నటించడం ఓ సాహసోపేతమైన చర్యగా భావించవచ్చు. యాక్షన్ చిత్రాల చట్రంలో ఇరుక్కు పోయిన సుమన్ చాలా సంవత్సరాల తర్వాత అన్నమయ్య చిత్రంలో శ్రీ వెంకటేశ్వరస్వామి పాత్ర ధరించి సుమన్ తన మూసచట్రంలో నుంచి బయటకు వచ్చారు. శ్రీవెంకటేశ్వరుని పాత్ర ఆయన కెరీర్ లో ఓ మైలురాయిగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు. మానవ కోటి కష్టాల కన్నీళ్లను తీర్చడానికి కలియుగంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు రూపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సతీమణి అలివేలు మంగను కీర్తిస్తూ అన్నమయ్య “శ్రీ వెంకటేశ్వర శతకం” రచించాడు. ఆయన రచించిన కీర్తనలు చాలావరకు అదృశ్యం కాగా 15 వేల కీర్తనలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

అయితే ఆయన కీర్తనలు ఎక్కువగా శృంగార కీర్తనలుగా ఉండడం విశేషం. అన్నమయ్యపై చిత్రాన్ని తీయాలని జంధ్యాలతో పాటు అనేకమంది దర్శకులు ప్రయత్నించి విఫలమయ్యారు. చిత్ర కవి ఆత్రేయ 18 పాటలను కూడా నమోదు చేయించి, స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నాడు. కానీ, ఆయన మరణంతో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. జె.కె.భారవి, రాఘవేంద్రరావుల కృషి ఫలితంగా ఈ చిత్రం సాకారం అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి పౌరాణికచిత్రం అన్నమయ్యే. 1997 దొరైస్వామిరాజు నిర్మాణం, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో “అన్నమయ్య” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి హీరో, హీరోయిన్లుగా నటించగా… సుమన్ శ్రీవెంకటేశుని పాత్రలో కనిపించడం విశేషం. భానుప్రియ, శ్రీ కన్య, మోహన్ బాబు, రోజా ఇతర ప్రధానపాత్రల్లో కనిపించారు.

అన్నమయ్య చిత్రాన్ని మొదటగా తిరుమలలో చిత్రించాలనుకున్నారు. కానీ అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒప్పుకోకపోవడంతో అన్నపూర్ణ స్టూడియోలో శ్రీ వేంకటేశ్వరుని గుడి సెట్ వేయడం జరిగింది. పైగా తిరుపతి వేంకటేశుని ప్రాంగణంలో ఆధునిక విద్యుత్ దీపాలు ఉండడంతో ఆనాటి దేవాలయ దృశ్యాలను చిత్రీకరించడానికి అవి అడ్డుగా ఉన్నాయని భావించి సినిమా చిత్రీకరణ అక్కడ జరపకూడదని యూనిట్ సభ్యులు నిర్ణయించుకున్నారు. కేరళ రాష్ట్రంలో పశ్చిమ కనుమలను తిరుపతి ఏడుకొండలుగా చిత్రీకరించడం జరిగింది.

ఈ చిత్రంలో కీరవాణి అందించిన సంగీతం అనిర్వచనీయం. ఈ సినిమాలో మొత్తం నలభై ఒక్క పాటలు ఉన్నాయి. ఏలే ఏలే మరదలా… అనే పాట ఒకప్పుడు ఎం ఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన “సీతారామయ్యగారి మనవరాలు” చిత్రంలోని “పూసింది పూసింది పున్నాగా.. అనే పాటను నేను పోలి ఉంటుంది. 1997 మే 22 రోజున అన్నమయ్య చిత్రం విడుదలయ్యింది. అయితే అన్నమయ్యకు ఈ చిత్రంలో మీసాలు ఉండటం ఏమిటి.?. పైగా ఆయన తన ఇద్దరి భార్యలతో సరస గీతాలు పాడడం ఏమిటి..? అనే విమర్శలు తీవ్ర ఎత్తున రావడం జరిగింది. కానీ సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. 42 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది.రెండు కేంద్రాలలో 175 రోజులు ఏకధాటిగా కొనసాగింది. ఈ సినిమాను తమిళంలో అన్నమాచారియర్ గానూ, హిందీలో తిరుపతి శ్రీ బాలాజీగానూ అనువదించి విడుదల చేశారు.