బుల్లి తెరపై ప్రేక్షకులను సందడి చేసిన బిగ్ బాస్ ప్రస్తుతం ఓటీటీలో 24 గంటల పాటు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఇక ఈకార్యక్రమం ఒక వారం పూర్తి చేసుకొని హౌస్ నుంచి మొదటి కంటెస్టెంట్ గా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ ప్రకటించడంతో ఒక్కసారిగా ముమైత్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు.
ముమైత్ ఖాన్ కు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్‌బాస్ హౌస్ వీడక తప్పలేదు. అయితే ముమైత్ కు ఎలిమినేషన్ భయం ముందు నుంచే ఉంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన క్షణం నుంచి ముమైత్ ఆట మీద కంటే.. నామినేషన్స్ ఎలిమినేషన్ మీదే ఫోకస్ పెట్టింది. ఈ నేపధ్యంలో ఆమె సింపతి గేమ్ ఆడినట్లు గా తెలుస్తుంది. అందుకే ముమైత్ ఇంత తొందరగా బయటకు వస్తుందని ఆమె కూడా ఊహించలేదు.
ఇక హౌస్ నుంచి ముమైత్ బయటకి వచ్చిన తరువాత ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ పై చర్చ మొదలైంది.. అసలు ముమైత్ ఖాన్ కు బిగ్‌బాస్ నిర్వాహకులు ఎంత పారితోషకం ఇచ్చారా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ షో కోసం ఆమెకు వారానికి రూ. 80 వేలు పారితోషికం అందుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎలా చూసినా ముమైత్ రెమ్యునరేషన్ లక్ష రూపాయల లోపే ఉంటుందని సమాచారం.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…