AP: ఏపీలో ఇక వాలంటీర్ వ్యవస్థ కొనసాగడం కష్టమేనా.. ఈ వ్యవస్థ ఉండదా?

AP: 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమిస్తూ ఆ 50 ఇళ్లకు ఏ విధమైనటువంటి ప్రభుత్వ పథకాలు అమలు కావాలన్నా వారి సమస్యలు ఏమున్న నేరుగా వాలంటీర్లు తెలుసుకొని సచివాలయంలోనే వారి సమస్యలకు పరిష్కారం దొరికేది.

ఇలా ప్రజల వద్దకే పాలన అనే విధంగా జగన్ ప్రభుత్వం ఉండేది. ఈ విధానంలో వాలంటీర్లు కీలకపాత్ర పోషించారు. అయితే 2024 కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను కొనసాగిస్తామని వీరికి పదివేల రూపాయల వేతనం చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో హామీ ఇచ్చారు. ఇక ఈయన అధికారం చేపట్టి కూడా 20 రోజులు అవుతుంది ఇప్పటివరకు వాలంటీర్ గురించి ఏ విధమైనటువంటి స్పష్టత ఇవ్వలేదు.

వాలంటీర్ వ్యవస్థ గురించి త్వరలోనే ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించిన అనంతరం స్పష్టత ఇస్తామని ఇప్పటికే మంత్రులు వెల్లడించారు. అయితే ఈ ఒకటవ తేదీ పింఛన్ ఇంటి వద్దకే వస్తుందని మంత్రులు తెలిపారు. అయితే వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగస్తుల చేత పింఛన్లను పంపిణీ చేయబోతున్నారు.

సచివాలయ ఉద్యోగస్తులు…
ఇలా సచివాలయ ఉద్యోగస్తులతో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపిస్తున్న తరుణంలో ఇకపై ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడినట్లేనని ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉండదని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటికే రేషన్ వాహనాలను కూడా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి తరుణంలో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి సచివాలయ సిబ్బందిని ఉపయోగించబోతున్నారనీ తెలుస్తుంది. మరి వాలంటీర్ వ్యవస్థ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.