Pawan Kalyan: ఒకటో తేదీ జీతం రాకపోతే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా అధికారులతో సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖలపై అన్ని విషయాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఎక్కడైతే అవకతవకలు జరిగి ఉంటాయో వాటిని ప్రశ్నిస్తూ ఎంతో చురుగ్గా పరిపాలన కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతూ… ప్రభుత్వం నడిపించేవారు బాధ్యత గల నాయకులైతే ప్రజలకు కష్టాలు వుండవనీ, ఐతే గత ప్రభుత్వంలో ఇది జరగలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి జీతం రాకపోతే వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని పవన్ తెలిపారు.

తాను ఓ ప్రభుత్వ ఉద్యోగి బిడ్డను ఒకటో తేదీ జీతం రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. నేను మీ కష్టాలను అర్థం చేసుకోగలనని పవన్ తెలిపారు. ఇప్పటికే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసింది అయితే ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది ఏంటి అనే విషయాల గురించి అన్ని ఆరా తీస్తున్నామని త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని తెలిపారు.

ఒకటో తేదీనే జీతం..
ఇక చంద్రబాబు నాయుడు గారు, తను కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల వారితో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పడమే కాకుండా ఒకటో తేదీకే జీతం పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago