Mohan Babu: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకరు. ఈయన నటుడిగా నిర్మాతగా విలక్షణ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మోహన్ బాబు ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మోహన్ బాబు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఓ సినిమా వేడుకలో భాగంగా ఈయన ఇలాంటి కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను జూనియర్ ఎన్టీఆర్ ని ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటూ పిలవనని ఈయన తెలిపారు. ఎందుకంటే తను తన తాతయ్య పేరు పెట్టుకున్నారు నేనెప్పుడూ కూడా సీనియర్ ఎన్టీఆర్ ని పేరు పెట్టి పిలవలేదని ఎప్పుడు పిలిచినా ఎంతో ఆప్యాయంగా అన్నయ్య అంటూ పిలిచే వాడినని మోహన్ బాబు తెలిపారు.
ఇలా అన్నయ్య పేరు పెట్టుకున్న తారక్ ను అన్నయ్య అంటూ పిలవలేను అలాగని పేరుతో పిలవలెను అందుకే తనని ఎప్పుడూ తారకా, ఏరా బాగున్నావా బిడ్డా అని ఆశీర్వదిస్తూ ఉంటానని మోహన్ బాబు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య స్థాయిలో గొప్పవాడు కావాలని హృదయపూర్వకంగా నేను కోరుకునేవాడిననీ ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తారకా…
మోహన్ బాబు ప్రస్తుతం మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాని నిర్మించడమే కాకుండా అందులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…