Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా డైరెక్టర్ గా సక్సెస్ అయినటువంటి ఈయన ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం విశేషం.
ఇలా ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ఇకపోతే ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇలా ఇప్పటివరకు ఆస్కార్ అవార్డు కోసం ఎంతో కష్టపడినా రాజమౌళి ఇకపై ఆస్కార్ ఇవ్వడాన్ని కూడా డిసైడ్ చేయబోతున్నారని తెలుస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో ఎంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయనకు ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. ఆస్కార్ అకాడమీలో మెంబర్ గా ఈయనకు చోటు కల్పించింది అయితే రాజమౌళికి మాత్రమే కాకుండా ఆయన సతీమణి రమ రాజమౌళికి సైతం ఆస్కార్ మెంబర్ గా అవకాశం ఇవ్వటం గవనార్హం.
ఆస్కార్ అకాడమీ మెంబర్..
2025లో ప్రకటించబోయే ఆస్కార్ అవార్డులలో భాగంగా వీరు కూడా తమ ఓటును వినియోగించుకోబోతున్నారు. ఇలా ఆస్కార్ అకాడమీ నుంచి రాజమౌళి దంపతులకు ఈ విధమైనటువంటి అవకాశం రావడంతో అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…