SSC Exams Reverification: పదో తరగతి ఫలితాలలో తక్కువ మార్కులు వచ్చాయా…అయితే ఇలా చేయండి!

SSC Exams Reverification: సోమవారం ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 6లక్షల 15వేల మంది పరీక్షలకు హాజరవ్వగా 4లక్షల 14వేల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇకపోతే పరీక్ష ఫలితాలలో చాలా మందికి తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా ఆందోళన చెందే విద్యార్థులు పరీక్షా పత్రాన్ని తిరిగి రీ కౌంటింగ్, రివల్యూషన్ చేయించుకునే సౌకర్యాన్ని కల్పించింది.

రీ కౌంటింగ్ చేసుకున్న విద్యార్థులు ప్రతి ఒక్క సబ్జెక్టుకు 500 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. www.cfms.ap.gov.in ద్వారా జూన్ 20 లోగా ఫీజు చెల్లించాలి.ఇకపోతే ఫ్రీ వెరిఫికేషన్ చేసిన ఆన్సర్ షీట్ కాఫీ కావాలనుకునేవారు ప్రతి సబ్జెక్టుకు వెయ్యి రూపాయలు చలానా చెల్లించాలి. ఇక ఎవరైతే రివాల్యూషన్ కోసం దరఖాస్తు చేస్తారో అలాంటి అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

అయితే నగదును కేవలం సీఎఫ్ఎమ్ఎస్ ద్వారా చలానా రూపంలో మాత్రమే తీసుకుంటారు. www.bse.ap.gov.in వెబ్ సైట్ లోనూ అలాగే డీఈఓ ఆఫీసులోని కౌంటర్లలో కూడా ఫారమ్ అందుబాటులో ఉంది. స్కూల్ హెడ్ మాస్టర్ ద్వారా కౌంటర్ సంతకం చేసిన హాల్ టికెట్ ఫోటో కాఫీ అభ్యర్థి పేరుతో పొందిన అవసరమైన మొత్తానికి సీఎఫ్ఎమ్ఎస్ సిటిజన్ చలాన్.
పైన పేర్కొన్న పత్రాలను దరఖాస్తు ఫారమ్‌ DEO ఆఫీసులలోని కౌంటర్లలో అందజేయాలి. DGE, A.P కి పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులు అంగీకరించరు. మార్కుల మొత్తం మారిన సందర్భాల్లో సవరించిన మెమోరాండం జారీ చేస్తారు.

రీ వెరిఫికేషన్ ప్రాసెస్…

రీ వేరిఫికేషన్ ప్రాసెస్ ద్వారాఇచ్చిన మార్కులను తిరిగి లెక్కించడం లేదా ఏదైనా ప్రశ్నలకు సమాధానాలు రాసి మార్కులు వేయకపోయినా తిరిగి మూల్యాంకనం చేసి మార్కులు కూడటం, ఇకపోతే రీ వెరిఫికేషన్ ద్వారా ప్రకటించిన మార్కులను ఫలితాలు వచ్చిన రెండు రోజుల తరువాత హెడ్ మాస్టర్ లాగిన్ నుంచి సబ్జెక్టుల వారీగా మార్కుల జాబితాను www.bse.ap.gov.in వెబ్ సైట్ లో ఉంచుతారు. ఇకపోతే విద్యార్థులు అధికారక వెబ్ సైట్ www.results.bse.ap.gov.in నుంచి కూడా మార్కుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.