Amnesia Pub Case: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మైనర్ బాలికపై అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అత్యాచార కేసు రోజుకొక మలుపు తిరుగుతూ పోలీసులకు సవాలుగా మారింది. ఈక్రమంలోనే క్లూస్ టీం సదరు మైనర్ బాలికపై ఇన్నోవా కారులో అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. కారులో నిందితుల స్పెర్స్, వెంట్రుకలు, వేలిముద్రలు, చెప్పులు వంటి వస్తువులను క్లూస్ టీం గుర్తించారు.
అయితే నిందితులు మొదట బాలికను బెంజ్ కారులో తీసుకు వెళ్లినట్లు గుర్తించారు.సాధారణంగా పబ్ కి మైనర్లు అనుమతి ఉండదు కానీ ఆ బాలికను ఎలా అనుమతించారు అనే విషయం గురించి ఆరా తీయగా పబ్ మేనేజర్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పార్టీ అంటూ 150 మంది వరకు పబ్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు.
ఇందులో 40 శాతం మంది అమ్మాయిలు ఉండగా 60 శాతం మంది అబ్బాయిలు ఉన్నారు.అయితే కాలేజ్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే వారికి పబ్బులో అనుమతి ఉంటుందని మేనేజర్ తెలిపారు. అయితే వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి ఆల్కహాల్ తీసుకోకుండా పార్టీ చేసుకున్నారు.అందరూ ఇక్కడ ఉన్న సమయంలో ఎలాంటి గొడవలు పడే అవకాశాలు కూడా కనిపించలేదని మేనేజర్ తెలియజేశారు.
ఆరోజు పబ్బుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ అన్నింటిని పోలీసులకు ఇచ్చినట్లు మేనేజర్ వెల్లడించారు. అయితే ఆ రోజు రాత్రి 8: 30 గంటల సమయంలో ఆ బాలిక తన జాకెట్ మర్చిపోయానని తిరిగి పబ్ కి వచ్చి తన జాకెట్ తీసుకు వెళ్లిందని అయితే ఆ సమయంలో కూడా ఆ అమ్మాయి చాలా క్యాజువల్ గా ఉందని,తనలో ఎలాంటి భయం ఆందోళన కూడా కనిపించలేదని ఈ సందర్భంగా ఈ అత్యాచార ఘటనపై మేనేజర్ ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…