Udaya Bhanu : బుల్లితెరపై ఒకప్పుడు యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను చాలా గ్యాప్ తరువాత మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది. ఒకప్పుడు హృదయాంజలి, సాహసం చేయరా డింభక, డాన్స్ బేబీ డాన్స్ వంటి షోలతో బాగా పాపులర్ అయిన ఉదయ భాను ఆ తరువాత సినిమాల్లోను ఎంట్రీ ఇచ్చింది. ఫైటర్స్ రామ్ లక్ష్మణ్ తో కలిసి సినిమాలో కుడా నటించింది. లీడర్ సినిమాలో రాజశేఖరా… అంటూ ఐటమ్ సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.
సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఉదయ భాను….
పెళ్లి తరువాత కెరీర్ కి దూరమైంది. ఒకప్పుడు రియాలిటీ షోలతో ఫుల్ క్రేజ్ తో ఉన్న ఉదయభాను ఆ తరువాత కనుమరుగయింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక వాళ్ళ ఆలనా పాలనతో కెరీర్ ని వదిలేసింది. ఇక ఇపుడు మళ్ళీ టీవీ లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోంది. ప్రస్తుతం జెమినీ టీవీ లో ప్రోగ్రామ్ చేస్తున్నా అంతగా షో హిట్ కాలేదు. ఇక ఈటీవీ లో కూడా గ్యాంగ్ లీడర్ అంటూ షో చేసినా ప్రయోజనం కలుగలేదు. అయితే ఇపుడు ఉదయభాను మరింత ప్రేక్షకులకు దగ్గర అవ్వడంకోసం సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తోంది.
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా ద్వారా తాను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నట్లు హింట్లు ఇస్తున్నా తాజాగా ఒక వీడియో ద్వారా అభిమానులను పలకరించింది. మీ అభిమానం నేను సాధించిన వరం, మీ ప్రేమ అభివర్ణించలేని అద్భుతం, నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడింది, నాకు ధైర్యమై నిలిచింది మీరే.. అంటూ అభిమానుల కోసం ఉద్వేగపూరితంగా మాట్లాడింది ఉదయభాను. మీ అభిమానంతో నన్ను ఎప్పుడూ పడిపోకుండా పట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? మీకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేయడం తప్ప.. అందుకే వస్తున్నా మీ ఉదయభాను’ అంటూ వీడియోలో ఎమోషనల్ గా మాట్లాడింది. ఇక ఈ వీడియోకి మంచి స్పందన లభించింది. చాలా మంది అభిమానులు మళ్ళీ ఇలా అందరికి చేరువవ్వడం సంతోషాన్నిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ గొంతులోనే ఏదో మ్యాజిక్ ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…