AP Assembly: అసెంబ్లీలో నోరు జారిన ఎమ్మెల్యే.. లేట్ చంద్రబాబు నాయుడు అంటూ?

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా ఆరోజు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక శనివారం ఈ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా స్పీకర్ గురించి పార్టీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి. ఈమె మాజీ ఎమ్మెల్యే మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు అనే సంగతి తెలిసిందే. ఇలా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఈమె ఇంగ్లీష్ లో ప్రసంగించారు. ఇలా సింధూర రెడ్డి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

చంద్రబాబు గారి హయంలో తాను ఎమ్మెల్యే కావడం తనకు చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. ఇక ఈమె సీనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే లేట్ ఎన్టీఆర్ అనబోయి లేట్ చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడారు. అయితే తన తప్పును గ్రహించిన సింధూర రెడ్డి వెంటనే సారీ అంటూ క్షమాపణలు కూడా చెప్పారు.

తెలుగులో మాట్లాడొచ్చు కదా..
ఇలా ఈమె తొందరపాటు కంగారులో లేట్ ఎన్టీఆర్ అనబోయి లేట్ చంద్రబాబు నాయుడు అని చెప్పడంతో నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే మొదటిసారి ఈమె ఎమ్మెల్యేగా ఎంపిక కావడంతో కంగారులో మాట్లాడి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. కానీ కొంతమంది మాత్రం ఈమె స్పీచ్ గురించి కామెంట్లు చేస్తున్నారు స్పష్టంగా తెలుగులో మాట్లాడొచ్చు కదా.. ఇలా ఇంగ్లీషులో మాట్లాడి తెలుగులో ఆ గౌరవ పరచడం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.